iDreamPost

ఢిల్లీలో రోగి.. గురుగ్రామ్‌లో డాక్టర్.. 40 కి.మీ దూరం నుంచి ఆపరేషన్!

Remote Surgery: సాంకేతికతను అందిపుచుకున్న వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఇచ్చే చికిత్స విధానంలో అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. తాజాగా ఢిల్లీలో ఓ అరుదైన ఆపరేషన్ జరిగింది.

Remote Surgery: సాంకేతికతను అందిపుచుకున్న వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఇచ్చే చికిత్స విధానంలో అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. తాజాగా ఢిల్లీలో ఓ అరుదైన ఆపరేషన్ జరిగింది.

ఢిల్లీలో రోగి.. గురుగ్రామ్‌లో డాక్టర్.. 40 కి.మీ దూరం నుంచి ఆపరేషన్!

ప్రస్తుతం వైద్య రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. సాంకేతికతను అందిపుచుకున్న వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఇచ్చే చికిత్స విధానంలో అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. టెక్నాలజీని ఉపయోగించే.. రోగులకు చేసే ఆపరేషన్లు కూడా మారిపోయాయి. వైద్య రంగంలో ఇప్పటికే అనేక అద్భుత ఘటనలు జరగ్గా.. తాజాగా మరో అరుదైన సంఘటన ఆవిషృతమైంది. గురుగ్రామ్ కు చెందిన వైద్యులు చేసిన ఆపరేషన్ అందరిని ఆశ్చర్యపరిచింది. మరి.. అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

సాధారణంగా రోగులు వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్తుంటారు. వారి పరిస్థితిని చూసి.. వైద్యులు సరైన చికిత్స అందిస్తుంటరు. అలానే మరికొన్ని సందర్భాల్లో రోగులకు ఆపరేషన్ కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఎక్కడనే రోగి, వైద్యులు ఇద్దరు ఒకే చోట ఉన్నప్పుటే ఆపరేషన్ కి సాధ్యమవుతుంది. కానీ తాజాగా గురుగ్రామ్ కు చెందిన వైద్యులు అద్ఫుతాన్ని ఆవిష్కరించారు.

 ఢిల్లీలో చికిత్స పొందుతున్న క్యాన్సర్‌ రోగికి 40 కి.మీ. దూరం నుంచి టెలీ సర్జరీ టెక్నిక్ ద్వారా డాక్టర్లు ఆపేరేషన్ నిర్వహించారు. అంతేకాక ఈ ఆపరేషన్ విజయవంత కావడంతో రోగి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌ జరిగింది.  రోగికి కోత పెట్టడం, కణితిని తొలగించడం, తిరిగి కుట్లు వేయడం వంటి మొత్తం ప్రక్రియ కేవలం 45 నిమిషాల్లోనే పూర్తైంది. డార్క్ గ్లాసెస్ ధరించి, రోబోట్‌ను ఆపరేట్ చేస్తూ, డాక్టర్లు రోగి మూత్ర నాళం చుట్టూ ఉన్న క్యాన్సర్ ప్రభావిత కణాలను తొలిగంచారు. త్వరలోనే బాధితుడు డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. గురుగ్రామ్ లోని గురుగ్రామ్‌లోని ఎస్‌ఎన్ ఇన్నోవేషన్‌లో వైద్యుల బృందం ఉండగా, ఢిల్లీలోని రోహిణిలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఆస్పత్రిలో రోగి చికిత్స అందుకున్నాడు. ఇక ఈ ఆపరేషన్ జరిగే సమయంలో ఎలాంటి అవతారాలు రాకుండా వైద్యుల బృందం అన్ని చర్యలు తీసుకుంది. ఇంటర్నెట్‌, టెక్నికల్ సమస్యలు వంటివి తెలెత్తకుండా చూసుకుని ఆపరేషన్ విజయవంతంగా చేశారు. క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్, జెనిటో-యూరో ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ రావల్‌ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించింది.

ఇక ఈ ఆపరేషన్  పూర్తైన అనంతరం డాక్టర్ రావల్ కీలక విషయాలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఏమూలన ఉన్న రోగులకైనా టెలి సర్జరీ ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆపరేషన్ సమయంలో తన రెండు చేతులు రోబోపై ఉంచానని, తాను ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్నట్లు భావించామని పేర్కొన్నారు. రోగి ఎదురుగా పడుకుండాగ మానిటర్ లో చూస్తు ఆపరేషన్ చేశామని తెలిపారు. సాధారణ ఆపరేషన్‌లో ప్రత్యక్షంగా రోగికి శస్త్రచికిత్స భాగం ఎలా కనిపిస్తుందో, ఈ టెక్నిక్‌లో త్రీడీ  ద్వారా కూడా మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ పద్ధతిలో పేషంట్ మాములు శస్త్రచికిత్సా విధానం కంటే త్వరగా కోలుకుంటాడని వైద్యులు తెలిపారు.  ఇక ఈ ఆపరేషన్ ను బెంగళూరుకు చెందిన 400 మంది వైద్యుల ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి