iDreamPost

Darlings movie review అలియాభట్ డార్లింగ్స్ రిపోర్ట్

Darlings movie review అలియాభట్ డార్లింగ్స్ రిపోర్ట్

ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కొత్త సినిమా డార్లింగ్స్ ఇటీవలే ఓటిటిలో విడుదలయ్యింది. థియేటర్లో వేసే కంటెంట్ కాకపోవడంతో నెట్ ఫ్లిక్స్ ద్వారా నిర్మాతలు నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ప్రేక్షకుల ఇంటికే తీసుకొచ్చారు. ట్రైలర్ చూశాక దీని మీద ఆసక్తి పెరిగింది. అందులోనూ మంచి క్యాస్టింగ్, డిఫరెంట్ గా అనిపించే స్టోరీ లైన్ ని జోడించడంతో సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. షెఫాలీ షా లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు నటించిన ఈ మూవీకి దర్శకురాలు జస్మిత్ కె రీన్. గంగూబాయ్ కటియావాడి సూపర్ హిట్ తర్వాత అలియా నటించిన ఈ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

అమ్మ(షెఫాలీ షా)మాటను జవదాటని బద్రున్నీసా(అలియా భట్) చాలా చలాకైన యువతి. ఈ కారణంగానే హంజా(విజయ్ వర్మ) ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంటాడు. అయితే హంజాది వంకర బుద్ది. తాగుడుకు విపరీతంగా అలవాటు పడిపోయి బద్రుని కొడుతూ హింసించడం మొదలుపెడతాడు. పైగా అనుమానిస్తాడు కూడా. దీంతో అతన్ని ఎలాగైనా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇది కాస్తా హంజాకు తెలిసిపోయి ఇద్దరి మధ్య గ్యాప్ మరింతగా పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు మరో స్కెచ్ వేసుకుని తల్లి సహాయం కోరుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, చివరికి ఆ కాపురం ఏమైందనేదే స్టోరీ

తీసుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ కేవలం నాలుగు పాత్రలతోనే క్లిష్టమైన డ్రామాను చెప్పించాలని చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కొన్ని సీన్లు బాగానే వచ్చినప్పటికీ బద్రు హంజాల మధ్య సన్నివేశాలు విపరీతమైన ల్యాగ్ తో ఒకదశలో విసిగిస్తాయి. కీలకమైన ప్రీ క్లైమాక్స్ ట్విస్టుతో పాటు ఆర్టిస్టుల బెస్ట్ పెర్ఫార్మన్స్ అండగా నిలిచినప్పటికీ దాని జస్మిత్ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. అలియా భట్ ఫ్యాన్స్ కేవలం తన నటనతోనే సంతృప్తి చెందుతారు. టేకింగ్ లో ఫ్రెష్ నెస్ ఉన్నప్పటికీ రైటింగ్ లో తడబాటు వల్ల మంచి టైంపాస్ గా నిలవాల్సిన డార్లింగ్స్ ఆ ఛాన్స్ మిస్ చేసుకుని జస్ట్ ఓకే అనిపించుకునే క్యాటగిరీలో పడింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి