iDreamPost

OTTలోకి వచ్చేసిన ఆర్టికల్ 370 మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Article 370 Movie OTT Streaming: ఓటీటీలోకి కొత్త సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులు అలర్ట్ అయిపోతున్నారు. అలాంటి ఆర్టికల్ 370 మూవీ వస్తోంది అనగానే ఆడియన్స్ ఫుల్ హ్యాపీ పోతున్నారు. మరి.. ఆ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది అంటే..

Article 370 Movie OTT Streaming: ఓటీటీలోకి కొత్త సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులు అలర్ట్ అయిపోతున్నారు. అలాంటి ఆర్టికల్ 370 మూవీ వస్తోంది అనగానే ఆడియన్స్ ఫుల్ హ్యాపీ పోతున్నారు. మరి.. ఆ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది అంటే..

OTTలోకి వచ్చేసిన ఆర్టికల్ 370 మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేటర్లలోకి ఏ సినిమాలు వస్తున్నాయో పట్టించుకుంటారో లేదో గానీ.. మూవీ లవర్స్ ఓటీటీ రిలీజెస్ మీద మాత్రం గట్టిగానే ఫోకస్ పెడుతున్నారు. ఏ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఎప్పటి నుంచి చూడచ్చు అనే వివరాలను మాత్రం పక్కాగా పెట్టుకుంటున్నారు. అయితే ఒక డైనమైట్ లాంటి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనాలు కూడా క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలపై పెద్ద ఎత్తున చర్చలు, వ్యతిరేకతలు కూడా వెల్లువెత్తాయి. అలాంటి మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.

ఇటీవలి కాలంలో ఏ మూవీ వచ్చినా దాని చుట్టూ ఏదో ఒక వివాదం అయితే నడుస్తోంది. ముఖ్యంగా యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కి సినిమాల విషయంలోనే ఇలా అవుతోంది. అలాంటి కోవకు చెందిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే ఆర్టికల్ 370 మూవీ. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీలో ప్రియమణి, యామీ గౌతమ్, రాజ్ అర్జున్, శివం ఖజూరియా వంటి స్టార్స్ లీడ్ రోల్స్ ప్లే చేశారు.

ఈ ఆర్టికల్ 370 మూవీ ఏప్రిల్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అంటే ఏప్రిల్ 18 అర్ధరాత్రి 12 గంటల నుంచే అందుబాటులోకి వస్తుంది. ఈ సినిమాని 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించేందుకు తీసుకొచ్చిన ఆర్టికల్ 370 నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో యామీ గౌతమ్ ఒక ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో నటించింది. కశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదం అసలు ఎలా మొదలైంది? ఎంత మేర విస్తరించింది? దానిని ఎలా నిర్మూలించాలి? అనే పాయింట్స్ ని ఈ మూవీలో టచ్ చేశారు.

ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఎన్ఐఏలో చేరిన పాత్రలో యామీ గౌతమ్ చక్కగా ఒదిగిపోయింది. ప్రియమణి కూడా ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండే సెక్రెటరీ పాత్రలో చక్కగా నటించింది. తన సీనియారిటీ ఈ సినిమాకి మంచి అసెట్ అయ్యింది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చూస్తుండగా.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి సంబంధించి చాలానే వ్యతిరేకత కూడా వచ్చింది. దీనిని తప్పుడు ప్రచారం చేసే సినిమా అంటూ చాలామంది ఆరోపణలు చేశారు. కానీ, వీటిని మూవీ డైరెక్టర్ కొట్టిపారేశారు. అలాంటి వారి మాటలు పట్టించుకోను అటూ తోసిపుచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి