iDreamPost

మనిషి చనిపోయాక.. ఎక్కడికి వెళ్తారు! OTTలో ఉన్న ఈ సిరీస్ మిస్ అయ్యారా?

  • Published Apr 15, 2024 | 6:22 PMUpdated Apr 15, 2024 | 6:32 PM

ఓటీటీ లోకి అనేక సినిమాలు, సిరీస్ లు వస్తున్న క్రమంలో.. ఆ సిరీస్ లు ఏ లాంగ్వాజ్ లో ఉన్నా సరే.. ప్రేక్షకులు కథను బట్టి ఆదరిస్తున్నారు, ఈ క్రమంలో తాజాగా మరొక హర్రర్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ లోకి రాబోతుంది. దీనికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

ఓటీటీ లోకి అనేక సినిమాలు, సిరీస్ లు వస్తున్న క్రమంలో.. ఆ సిరీస్ లు ఏ లాంగ్వాజ్ లో ఉన్నా సరే.. ప్రేక్షకులు కథను బట్టి ఆదరిస్తున్నారు, ఈ క్రమంలో తాజాగా మరొక హర్రర్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ లోకి రాబోతుంది. దీనికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

  • Published Apr 15, 2024 | 6:22 PMUpdated Apr 15, 2024 | 6:32 PM
మనిషి చనిపోయాక.. ఎక్కడికి వెళ్తారు! OTTలో ఉన్న ఈ సిరీస్ మిస్ అయ్యారా?

ఓటీటీ అనగానే అందరికి మంచి మంచి సినిమాలు, సిరీస్ లు గుర్తొస్తాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీ లోకి అద్భుతమైన సినిమాలు వచ్చేస్తున్నాయి. సినిమాలకంటే కూడా.. సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పి తీరాలి. సిరీస్ ల లో ఒక్కో ఎపిసోడ్ ఎండ్ లో ఉండే సస్పెన్స్ కోసమైనా అందరూ వీటిని చూసేందుకు ఇష్టపడుతున్నారు. వాటిలో ముఖ్యంగా క్రైం, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే.. హర్రర్, సస్పెన్స్ సినిమాలను మాత్రమే ఇష్టపడే వారే ఎక్కువగా ఉంటూ ఉంటారు. పైగా వాటికీ భాషతో సంబంధం లేకుండా.. ఏ భాషలో ఉన్నా సరే.. వాటిని ఆదరించేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో త్వరలో ఓటీటీలోకి.. మరొక న్యాచురల్ హార్రర్ కామెడీ డిటెక్టివ్ వెబ్ సిరీస్ రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి ! ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

ప్రముఖ ఓటీటీ సంస్థ తాజాగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ పేరు “డెడ్ బాయ్స్ డిటెక్టివ్స్”. ఈ సిరీస్ కు నీల్ గైమాన్, మాట్ వాగ్నెర్ లు కథను అందించారు. అలాగే చాలా మంది దర్శకత్వం వహిస్తూ.. ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. మొత్తంగా ఆరుగురు డైరెక్టర్స్ తల ఒక ఎపిసోడ్ ను అదిరిపోయే కథాంశంతో అందరిని ఆకట్టుకునేలా.. ఈ సిరీస్ ను తెరకెక్కించారు. దీనితో అందరు ఈ సిరీస్ ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ నిర్మించింది. ఇక ఈ సిరీస్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తామని .. తాజాగా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్స్ ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. మరి ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక డెడ్ బాయ్స్ డిటెక్టివ్స్ సిరీస్ కథ విషయానికొస్తే.. ఒక మనిషి చనిపోయిన తర్వాత.. అతడు ఎక్కడికి వెళ్తాడు.. ఒకవేళ వేరే లోకానికి వెళ్తే అక్కడ అతని లాంటి మనుషులే ఎదురైతే.. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి! అసలు నిజంగానే మనిషి చనిపోయిన తర్వాత వేరే లోకానికి వెళ్తాడా ! ఏమో ! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే మరి. ఒక వైపు ఈ సిరీస్ లో ఉండే సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టించినా కానీ.. మరోవైపు కామెడీ కూడా అదే రేంజ్ లో ఉంటుందట. కాబట్టి కామెడీ, సస్పెన్స్, హర్రర్ ఈ మూడు జోనర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ ఒక్క సిరీస్ తో.. ఫుల్ ఎంటెర్టైనేమేంట్ లభించేస్తుంది. మరి, డెడ్ బాయ్స్ డిటెక్టివ్స్ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి