iDreamPost

OTTలో ఈ సిరీస్ ఒక్కరే చూస్తే తోపులే.. కానీ, గుండె గట్టిదై ఉండాలి!

OTT Suggestions- Best Horror Web Series: ఓటీటీలో చాలా మంది ఏ సినిమా చూసినా చూడకపోయినా.. హారర్ మాత్రం మిస్ కాకుండా చూస్తారు. అలాంటి వారి కోసం ఒక మంచి హారర్ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Horror Web Series: ఓటీటీలో చాలా మంది ఏ సినిమా చూసినా చూడకపోయినా.. హారర్ మాత్రం మిస్ కాకుండా చూస్తారు. అలాంటి వారి కోసం ఒక మంచి హారర్ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం.

OTTలో ఈ సిరీస్ ఒక్కరే చూస్తే తోపులే.. కానీ, గుండె గట్టిదై ఉండాలి!

ఓటీటీలో ఏ చిత్రం చూసినా చూడకపోయినా.. కొందరు మాత్రం క్రమం తప్పకుండా హారర్ చిత్రాలు, వెబ్ సిరీస్లు చూస్తూ ఉంటారు. ఎందుకంటే భయపడుతూ హారర్ చిత్రాలు చూడటం ఒక బ్యాడ్ హ్యాబిట్ దానిని మానుకోవడం కష్టం. అలాంటి వారికి ఒక పట్టాన చిత్రాలు నచ్చవు. అందుకే ఒక క్రేజీ వెబ్ సిరీస్ ని మీకోసం తీసుకొచ్చాం. ఇది నిజానికి విడుదలై మూడేళ్లు దాటుతున్నా చాలా తక్కువ మందికి ఈ సిరీస్ గురించి తెలుసు.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే ఇది అందుబాటులో ఉంది. మరి.. ఆ వెబ్ సిరీస్ ఏంటి? అంత భయానకంగా అందులో ఏముంది? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..

హారర్ చిత్రాలు, సిరీస్లు అంటే ఒక మంచి పాయింట్ తో స్టార్ట్ కావాలి. అలాంటి పాయింట్ ఈ సిరీస్ లో చాలా బలంగానే ఉంది. పైగా జాంబీస్ మూవీస్ ఇష్ట పడే వారికి ఇది బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ లో వచ్చే జాంబీ చిత్రాల్లో అంత గొప్ప కథ, పాయింట్ ఉండవు. కానీ, ఇది మేడ్ ఇన్ ఇండియా సిరీస్ కావబట్టి.. హారర్ జానర్లో జాంబీ బ్యాగ్ డ్రాప్ లో అదిరిపోయే వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ ని చూడాలంటే ఎంత హారర్ చిత్రాలు చూసే వాళ్లైనా కూడా కాస్త ధైర్యం కావాలి. పుసుక్కున్న పంతానికి పోయి ఒక్కరే స్టార్ట్ చేయకండి. కొంచం భయంకరంగానే ఉంటుంది. కానీ, చివర్లో మాత్రం భలే సిరీస్ చూశాం అనే ఫీలింగ్ కలుగుతుంది.

Betaal movie

ఇంత బిల్డప్ ఇస్తోంది.. బేతాళ్ అనే వెబ్ సిరీస్ కి. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్ ని గౌరీ ఖాన్ నిర్మించారు. ఈ బేతాళ్ వెబ్ సిరీస్ 2020 మే నెల నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మొత్తం 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. నిజానిక వెబ్ సిరీస్ అనగానే.. ఒక పాయింట్ చూపించి సీరియల్ లాగా లాగుతూ ఉంటారు. కానీ, ఇది మాత్రం సూటిగా సుత్తి లేకుండా చూపించారు. ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఒక సొరంగం ఉంటుంది. దానిని ఓపెన్ చేస్తే అనర్థాలు జరుగుతాయని అక్కడి స్థానికుల నమ్మకం.

ఆ టన్నెల్ ని ఎలాగైనా ఓపెన్ చేయాలని చేసిన ప్రయత్నం అసలైన అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఆ ఊరు మాత్రమే కాదు.. ఆ ఆపరేషన్లో పాల్గొన్న అందరి జీవితాలను మార్చేస్తుంది. అసలు ఆ ఊరి కథ ఏంటి? చనిపోయిన బ్రిటీష్ ఆర్మీ ఎందుకు లేచి వస్తోంది? చనిపోయిన వాళ్లంతా ఆ ఆర్మీ తరఫున ఎందుకు పోరాడుతున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను ట్రైలర్ రూపంలో రేకెత్తించారు. వాటికి సమాధానాలు కావాలి అంటే మీకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బేతాళ్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. కాకపోతే కాస్త ధైర్యం చేసుకుని చూడండి. కొంచం భయంకరంగానే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి