iDreamPost

దండుపాళ్యం హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే?

  • Published Jun 18, 2024 | 5:44 PMUpdated Jun 18, 2024 | 5:44 PM

క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన దండుపాళ్యం మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటిలో ఈ మూవీ సెన్సేషనల్ సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఆ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన దండుపాళ్యం మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటిలో ఈ మూవీ సెన్సేషనల్ సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఆ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Jun 18, 2024 | 5:44 PMUpdated Jun 18, 2024 | 5:44 PM
దండుపాళ్యం హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే?

సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్నే అందిస్తుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల అభిరుచుల మేరకు ఇప్పటి వరకు ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా వివిధ రకాల జానర్స్ లో డిఫరెంట్ కాన్సేప్ట్ లతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఎలాంటి సినిమాలు వచ్చిన ప్రేక్షకులు ఎక్కువగా క్రైం థ్రిల్లర్ సినిమాను ఎక్కువగా ఇష్టపడతారనే చెప్పవచ్చు. ఎందుకంటే.. థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పటికి ఈ తరహా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను చాలానే మెప్పించాయి. కాగా, అలాంటి వాటిలో ‘దండుపాళ్యం’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ రాజు తెరకెక్కించారు. అయితే 2012లో వచ్చిన ఈ సినిమా కన్నడ భాషల్లో మొదట కన్నడలో భాషలో తెరకెక్కింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా విడుదల చేశారు.

ఇకపోతే ఈ క్రైమ్ థ్రిల్లర లో పూజా గాంధీ,రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, పి. రవిశంకర్ అలాగే రఘు ముఖర్జీ నటించారు. అయితే ఈ సినిమాని దండుపాళ్య అనే పేరు మోసిన ముఠా నిజ జీవితంలోని దోపిడీల ఆధారంగా రూపొందించారు.కాగా, అప్పటిలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కూడా రాబెట్టింది. ఇక ఈ సినిమా ఫ్రాంచైజీలో నాలుగు భాగలుగా విడుదలైన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన పూజా గాంధీ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడిసిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా బోల్డ్ గా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసింది ఈ చిన్నది. అయితే ఇలా చాలా సినిమాల్లో నటించిన అలరించిన పూజ ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు.

దండుపాళ్యాం ఫేమ్ పూజ గాంధీ ఎక్కువగా కన్నడ భాషల్లో సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. ఈ క్రమంలోనే కన్నడ తో పాటు.. తమిళ్, తెలుగు భాషాల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2021 తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ యాక్టివ్ గానే ఉంటుంది. ఈ  క్రమంలోనే తరుచు సోషల్ మీడియాలో తన రెగ్యూలర్ ఫోటోలు షేర్ చేస్తు ఉంటుంది. ఇక సినిమాలకు దూరం అయిన పూజా గాంధీ 2012లో జనతాదళ్ పార్టీలో చేరింది. ఆ తర్వాత.. కేజేపీ పార్టీలోకి అక్కడికి కొన్నాళ్లకు బి.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాగా, ప్రస్తుతం ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఫోటో చూసిన నెటిజన్స్  అసలు పూజా గాంధీనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా గాంధీ లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి