iDreamPost

భర్తకు దూరం.. ప్రియుడు కూడా అలా చేయడంతో..

ఏడేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది స్వాతి. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప పుట్టింది. కానీ భార్యా భర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భరించలేక.. బిడ్డను తీసుకుని పుట్టింటికి చేరింది స్వాతి. కానీ అంతలో

ఏడేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది స్వాతి. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప పుట్టింది. కానీ భార్యా భర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భరించలేక.. బిడ్డను తీసుకుని పుట్టింటికి చేరింది స్వాతి. కానీ అంతలో

భర్తకు దూరం.. ప్రియుడు కూడా అలా చేయడంతో..

ఈ ఫోటోలోని అమ్మాయి పేరు స్వాతి.. ఓ అబ్బాయిని ప్రేమించింది.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లికి ముందు ఉన్న ప్రేమ.. వివాహం తర్వాత కొరవడింది. దీంతో భార్యా భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అంతలో వీరికి ఓ పాప పుట్టింది. అయినప్పటికీ మనస్పర్థలు పెరిగాయి కానీ తరగలేదు. రాను రానూ అవి మరింత ముదరడంతో భర్తకు దూరంగా ఉంటుంది. పుట్టింటికి వచ్చేసి ఓ పనిలో కుదిరింది. ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తూ బిడ్డను చూసుకుంటుంది. కూతుర్ని తల్లి వద్ద ఉంచి.. ఆమె మాత్రం ఓ హాస్టల్లో ఉంటుంది. అంతలో ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యాడు మరో వ్యక్తి. అతడు చెప్పే మాయమాటలకు పడిపోయింది. అంతలో భర్త కూడా తన బిడ్డను రెండు రోజుల్లో తీసుకు వచ్చి అప్పగిస్తానని చెప్పి.. తీసుకురాలేదు.

అంతలో ప్రియుడు కూడా దూరమయ్యాడు. బిడ్డను చూసుకోవడానికి వీలు లేకుండా పోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖలోని గాజువాకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాపురం దరి కాకరలోవ జై ఆంధ్రకాలనీకి చెందిన దండు భాను కుమార్తె స్వాతి (23)కి వేపగుంట వద్ద గల చీమలాపల్లికి చెందిన కొప్పల దేవేంద్ర కుమార్‌ను ప్రేమించింది. ఇంట్లో విషయం తెలిసి పెద్దలు తొలుత వద్దన్నారు. కానీ తర్వాత అతడ్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కాదనలేక ఒపపుకున్నారు. ఏడేళ్ల క్రితం వీరికి పెళ్లి జరిగింది. వీరికి కూతురు జన్మించింది. అయితే కొన్నేళ్ల నుండి భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పెళ్లైన నాలుగేళ్లకే తల్లి వద్దకు వచ్చేసింది స్వాతి.

 పాపను మల్కాపురంలో తల్లి వద్ద ఉంచి.. ఆమె గాజువాకలోని ఓ షాపింగ్ మాల్‌లో పనికి చేరింది. ఇంటికి, ఉద్యోగానికి దూర భారం కావడంతో నగరంలోని ఓ హాస్టల్లో ఉంటోంది. వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది స్వాతి. అంతలో రోహిత్ కుమార్ అనే వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉండేది. అయితే రెండు నెలల క్రితం స్వాతి భర్త దేవేంద్ర వచ్చి.. బిడ్డను రెండు రోజుల్లో ఇస్తానని చెప్పి.. తీసుకెళ్లి తిరిగి తీసుకురాలేదు. ఇటు ప్రియుడు రోహిత్‌తో కూడా ఆమెకు బ్రేకప్ అయ్యింది. అటు భర్త దూరమై.. ఇటు ప్రియుడితో బ్రేకప్ అయ్యి.. కూతురు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. జీవితం మీద విరక్తితో హాస్టల్లో ఆదివారం అర్థరాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన హాస్టల్ వార్డెన్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి