iDreamPost

అటల్ సేతు వంతెనపై పగుళ్లు.. హీరోయిన్ రష్మికపై ట్రోల్స్!

ప్రధానమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్  సేతు బ్రిడ్జిపై పగుళ్లు వచ్చాయి. ఆ పగుళ్లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన్నపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రధానమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్  సేతు బ్రిడ్జిపై పగుళ్లు వచ్చాయి. ఆ పగుళ్లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన్నపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

అటల్ సేతు వంతెనపై పగుళ్లు..  హీరోయిన్ రష్మికపై ట్రోల్స్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో అనేక కీలక నిర్మాణాలను చేపట్టింది. కొన్ని అయితే ఏకంగా ప్రపంచాన్నే ఆకర్షించేలా ఉన్నాయి. అలాంటి వాటిల్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటి ఒకటి. అంతేకాక పలు వంతెనల నిర్మాణాలు సైతం చేశారు. అలాంటి వాటిల్లో ముంబైల్ లోని అటల్ సేతు ఒకటి. ఇది దేశంలోనే సముద్రంపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా రికార్డు సృష్టించింది. అయితే తాజాగా ఈ అటల్ సేతు బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ఆ పగుళ్లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన్నపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరి.. బ్రిడ్జి పగుళ్లు వస్తే.. రష్మికపై ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధానమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్  సేతు బ్రిడ్జిపై పగుళ్లు వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ఈ అటల్ సేతును ప్రధాన మంత్రి మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ముంబైలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి సాంకేతికతను వినియోగించి అటల్ సేతును నిర్మించింది. రూ.18 వేల కోట్లతో సముద్రంపై 21.8 కిలోమీటర్ల మేర ఈ వంతెనను నిర్మించింది. ఇది మన దేశంలోనే సముద్రంపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇది ఇలా ఉంటే.. ఈ బ్రిడ్జిపై పగుళ్లు ఏర్పడిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

ఇదే సమయంలో రష్మిక మందాన్నపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో అటల్ సేతుపై ప్రయాణించి.. కేంద్ర ప్రభుత్వంపై రష్మిక ప్రశంసల జల్లు కురిపించించింది. . దీంతో పగుళ్లకు సంబంధించిన  వీడియోలు పోస్ట్ చేస్తూ.. రష్మికను ఆడుకుంటున్నారు. ఇప్పడు కూడా వీడియోలు చేయాలని, వేర్ ఈజ్ రష్మిక అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదే సమయంలో ఆమెకు ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు.. రష్మికను అనడం ఏంటని రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఇష్యుపై కాంగ్రెస్ నేతలు, బీజేపీ సర్కార్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వాటి మాటలకు బీజేపీ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.

కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను బీజేపీతో పాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఖండించింది. ఆ పగుళ్లు వచ్చింది అటల్ సేతు వంతెనకు కాదని.. దానికి ఉండే అప్రోచ్ రోడ్డుకు స్పష్టం చేసింది. నవీ ముంబైలోని ఉల్వె లింక్ రోడ్డు అని ముంబై అధికారులు స్పష్టం చేశారు. అటల్ సేతు బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. అది ఉల్వె నుంచి ముంబైకి మధ్య అటల్ సేతును కలిపే అప్రోచ్ రోడ్డు అని తెలిపారు. అటల్ వంతెనపై చేస్తున్న దుష్ప్రచారం ఆపండి అని బీజేపీ ట్వీట్ చేసింది. ఇలా వీరి మధ్య జరుగుతున్న వార్ మధ్యలో రష్మికను లాగొద్దని, ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి