iDreamPost

ప్యాకేజీ స్టార్ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే నిర్ణయించాడు: CM జగన్

CM Jagan Memantha Siddham Bus Yatra 18th Day Highlights: వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా 18వ రోజు జరిగిన హైలెట్స్ ఏంటంటే..

CM Jagan Memantha Siddham Bus Yatra 18th Day Highlights: వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా 18వ రోజు జరిగిన హైలెట్స్ ఏంటంటే..

ప్యాకేజీ స్టార్ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే నిర్ణయించాడు: CM జగన్

వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్రి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ బస్సు యాత్రతో ప్రజలతో మమేకమవుతూ.. వారికి ఇప్పటివరకు ఈ ఐదేళ్లలో అందించిన సంక్షేమం గురించి స్పష్టంగా వివరిస్తూ.. బహిరంగ సభల్లో ప్రతిపక్షాల కుట్రలను ఎండగడుతూ.. సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సాగుతోంది. అలాగే ఇదీ మా సమస్య అంటూ ఎవరైతే సీఎం దగ్గరకు వస్తున్నారో వారి గోడును విని.. వారికి త్వరిత గతిన ప్రయోజనం కలిగేలా హామీ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే ఈ బస్సు యాత్ర 17 రోజులు పూర్తి చేసుకుంది. మరి.. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో 18వ రోజు జరిగిన విశేషాలు ఏంటో చూద్దాం.

ఉదయం ఎస్టీ రాజాపురంలో ప్రారంభమైన బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో ప్రవేశించింది. అశేష జనవాహిని సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా భారీ కటౌట్లతో, బాణా సంచా కాలుస్తూ ఘనంగా కాకినాడ జిల్లాలోకి ఆహ్వానించారు. తర్వాత రంగంపేట మీదుగా ఉండూరు క్రాస్ చేరుకున్నారు. ఉండూరు క్రాస్ వద్ద జె.సత్యనారాయణ అనే పేషెంట్ ని కలిసి మాట్లాడారు. అతనికి పిరుదలకు సర్జరీ జరగడంతో వీల్ చైర్ కే పరిమితమయ్యాడు. సీఎం సహాయనిధి నుంచి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఉండూరు క్రాస్ నుంచి తిమ్మాపురం మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో ప్రతిపక్షాలను చీల్చి చెండాడారు.

చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రలపై, ప్రజలకు చెబుతున్న మాయ మాటలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి రెండు ఓట్లు ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. “ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే సందర్భం మాత్రమే కాదు.. మీ జీవితాలను, మీ తల రాతలను మార్చే ఎన్నికలు. ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. రాష్ట్రాన్ని హోల్ సేల్ గా దోచుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు ఎవరికి సీటు ఇవ్వమంటే బీజేపీ తరఫున పురందేశ్వరి వారికే సీటు ఇస్తారు. బావ పొడవమంటే పురందేశ్వరి తండ్రినే వెన్నుపోటు పొడిచారు.  బీఫామ్ మాత్రం బీజేపీ, గాజు గ్లాసు, కాంగ్రెస్ దే అయినా కూడా యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే.

చంద్రబాబు తన సంకలో ఉన్న పిల్లిని పిఠాపురంలో వదిలాడు. ప్యాకేజీ స్టార్ కి జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ పారిపోయే రకం. పవన్ ని బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. ప్యాకేజీ స్టార్ కి పెళ్లిళ్లే కాదు.. నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి. మీ బిడ్డ వైఎస్ జగన్ పదేళ్లు ఇదే స్థానంలో కొనసాగితేనే జగన్ మార్క విప్లవాలు కొనసాగుతాయి. లేదంటే.. నాడు- నేడు రద్దు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం రద్దు, పిల్లలకు ఇచ్చే గోరు ముద్ద రద్దు, విద్యా కానుక రద్దు, వసతి దీవెన, ట్యాబ్స్ ఇలా అన్నీ పథకాలు రద్దవుతాయి. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లకలక అంటూ అన్నింటికి ముగింపు పలుకుతుంది. చంద్రబాబు మార్క్ తో కత్తిరింపులు, ముగింపులను మీరు చూడాల్సి ఉంటుంది. ఫ్యానుకు ఓటేస్తేనే గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ఉంటాయి” అంటూ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి