iDreamPost

రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోతే చాకిరేవు పెడతా: CM రేవంత్

CM Revanth On Central Government: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి ఈ సభ నుంచి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

CM Revanth On Central Government: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి ఈ సభ నుంచి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోతే చాకిరేవు పెడతా: CM రేవంత్

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రాన్ని బహిరంగంగానే సహకారం కోరానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధికి సహకరించకపోతే చాకిరేవు దగ్గర ఉతికి ఆరేస్తానంటూ ఘాటుగా స్పందించారు. పాలమూరు ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. కేంద్రానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించబోతున్న విషయాన్ని వెల్లడించారు. అలాగే 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ వ్యాఖ్యానించారు. పాలమూరు బిడ్డను సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ దే అంటూ గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే తప్పేంటి అంటూ రేవంత్ ప్రశ్నించారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ప్రజలకు మంచిది కాదు అంటూ వ్యాఖ్యానించారు. అతిథిని గౌరవించాలనే ప్రధాని సభకు వెళ్లానంటూ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అడిగిన నిధులు ఇవ్వకపోతే మాత్రం చాకిరేవు పెట్టి ఉతికి ఆరేస్తాను అంటూ హెచ్చరించారు. మోదీతో అయినా కేడీతో అయినా కొట్లాడేందుకు తాను సిద్ధం అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వంపై కూడా సీఎం రేవంత్ విమర్శలు చేశారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారంటూ ఘాటు విమర్శలు చేశారు.

గద్వాలుకు నీళ్లు తెస్తానన్న కేసీఆర్ ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఒంట్లో బాగోకపోతే.. అసెంబ్లీకి రాకుండా.. నల్గొండకు ఎలా వెళ్లారని కేసీఆర్ ను నిలదీశారు. లోక్ సభ ఎన్నికల తమ 90 రోజుల పాలనకు రెఫరెండం అన్నారు. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్లను పథకాన్ని ప్రారంభించబోతున్నాం అన్నారు. అలాగే ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే 6 నెలలు కూడా ఉండనివ్వరా అంటూ ప్రశ్నించారు. 40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ నిలదీశారు. తమ ప్రభుత్వం మీదకు వస్తే తొక్కుకుంటూ బొందపెడతా అని హెచ్చరించారు. మరి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి