iDreamPost

కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే.. హామీలు 100 శాతం అమలు చేయగలం: CM రేవంత్

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలంటూ వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలంటూ వ్యాఖ్యానించారు.

కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే.. హామీలు 100 శాతం అమలు చేయగలం: CM రేవంత్

రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మీదనే కాకుండా.. కేంద్రంలోని బీజేపీ మీద కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్.. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ వ్యాఖ్యానించారు. పైగా 100 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ విమర్శలు చేశారు. దేశం దివాళా తీయడానికి మోదీనే కారణమన్నారు. మూడోసారి మోదీని ప్రధానిని చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందంటూ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందంటూ సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

అప్పులు, ఫిరాయింపుల్లో ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ పడ్డారు అంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. మోదీ రైతులను పట్టించుకోకపోవడం మాత్రమే కాకుండా.. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారంటూ చెప్పుకొచ్చారు. దేశానికి రాహుల్ గాంధీ లాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉందంటూ వ్యాఖ్యానించారు. మోదీని మూడోసారి కూడా ప్రధానిని చేసేందుకు కేసీఆర్ పార్టీ బీజేపీతో చీకటి ఒప్పందం చేసిందంటూ ఘాటు వ్యాఖ్యులు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే.. మూసీలో వేసినట్లే అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందన్నారు. బావాబామ్మర్దులే పోటీ పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.

కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం కేసీఆర్ కేంద్రాన్ని అడిగింది లేదు.. కేంద్రం నుంచి మోదీ ఇచ్చింది లేదంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఇచ్చేది తామే.. తెచ్చేది కూడా తామే అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17కి సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండాలంటూ చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని బరిలోకి దించాలంటూ కోరారు. సోనియా గాంధీ మీద ఎవరూ పోటీ పెట్టొద్దంటూ సూచించారు. సోనియా గాంధీ నామినేషన్ వేస్తే.. ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఇక్కడున్న పార్టీలు గౌరవం ఇచ్చినట్లు అంటూ చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ నామినేషన్ వేసిన తర్వాత తెలంగాణ బిడ్డలు ఎవరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు అంటూ వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి