iDreamPost
android-app
ios-app

ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకునేందుకే పవన్ పర్యటనలు: CM జగన్

ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకునేందుకే పవన్ పర్యటనలు: CM జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలతో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా పేదలకు సొంతింటి కల నిరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. తాజాగా జగనన్న కాలనీలోని ఇళ్లను సీఎం జగన్ గురువారం సామర్ల కోటలో ప్రారంభించారు.  కాకినాడ జిల్లా సామర్ల కోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు , ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆధ్వార్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. సీఎం జగన్  నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళ పేరిటే ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి.. దేశంలో రికార్డు సృష్టించారు ఇక సామర్ల కోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్.

సామర్లకోట సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు కంటిన్యూగా నెల రోజుల పాటు మన రాష్ట్రంలో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడు, బాలకృష్ణ.. ఎవరూ మన రాష్ట్రంలో ఉండటం లేదని సీఎం అన్నారు. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్, దత్తపుత్రుడి మాత్రం మూడు, నాలుగేళ్లకు మారుతుందని సీఎం జగన్  అన్నారు. ప్యాకేజీ స్టార్ కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదని, ఎల్లో బ్యాచ్ కు ప్రజల మీద ప్రేమ లేదని సీఎం జగన్ మండిపడ్డారు.

వీళ్లు కోరుకునేది ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం.. హైదరాబాద్ లో దాచుకోవడం మాత్రమే. వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారమేని సీఎం జగన్ అన్నారు. తన అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకునేందుకు  అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్ అంటూ దుయ్యబట్టారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే  ఓ వ్యాపారి పవన్ అంటూ సెటైర్లు వేశారు. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదని, మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు అంటూ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ స్టార్ కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలని, రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారంటూ సీఎం జగన్ మండిపడ్డారు.

బాబుకు అధికారం పోతే వీళ్లకు ప్యూజులు పోతాయని, పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతుందని కోర్టులకెళ్తారని సీఎం జగన్  అన్నారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు.  రాజకీయాలంటే విలువ, విశ్వసనీయతఉండాలని, చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలని సీఎం అన్నారు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడే వాడే నాయకుడని సీఎం తెలిపారు. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుందని, అదే బాబు పేరు చెబితే గజదొంగల ముఠా పెత్తందారి అహంకారం గుర్తొస్తుందని సీఎం జగన్ మండిపడ్డారు. మరి.. పవన్ పై సీఎం చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.