iDreamPost

నాడు సీఎం జగన్ పై నిందలు! నేడు అదే స్థితికి లోకేష్!

నాడు సీఎం జగన్ పై నిందలు! నేడు అదే స్థితికి లోకేష్!

కర్మ ఫలితం అనేది తప్పక అనుభంచాలని పెద్దలు అంటారు. అవును… ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఇక ఈ మాటలు ఇప్పుడు టీడీపీ నేతల్లో ముఖ్యంగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ విషయంలో నిజమైందనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్ని విధాలుగా ఇబ్బందులకి గురి చేశారో.. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే జగన్ ముఖ్యమంత్రి  హోదాలో రాష్ట్రాభివృద్ధికి ఢిల్లీ వెళ్తే.. కేసుల విషయం గురించే మాట్లాడేదుంకు వెళ్లినట్లు టీడీపీ నేతలతో పాటు లోకేశ్ విమర్శించారు. అయితే కర్మ ఫలితంగా ప్రస్తుతం లోకేశ్ కి అదే  పరిస్థితి  వచ్చింది.

బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తన తండ్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, అలాగే తన కుటుంబ సభ్యుల్ని జగన్ ప్రభుత్వం వేధిస్తున్నట్లు అమిత్ షాకు లోకేశ్ ఫిర్యాదు చేశారు. తన తండ్రిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచారని లోకేశ్.. అమిత్ షాతో విన్నవించుకున్నారంట. అయితే ప్రస్తుతం లోకేశ్ అమిత్ షాను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై నెటిజన్లు ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు చేసుకున్న ఫలితమే కదా లోకేశ్.. ఇప్పుడు అనుభవిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నాడు జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ తో కలిసి అక్రమంగా 16 నెలలు జైల్లో ఉంచింది మీ తండ్రి చంద్రబాబు కాదా అంటూ లోకేశ్ ను విమర్శిస్తున్నారు. అప్పుడు జగన్ పై వాళ్లు చేసింది సరైందని, నేడు మాత్రం తమ అరెస్ట్ అన్యాయం అన్నట్లు గగ్గోలు పెడుతున్నారు. ఎవరి నుంచి తప్పించుకున్న దేవుడి నుంచి తప్పించుకోలేరని, ఇన్నాళ్లుగా వారు చేసిన పాపాలు ,ఘోరాలు, మోసాల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో విధంగాలు అవమానాలకు గురి చేసిన టీడీపీ, ఆయన సీఎం అయిన తరువాత కూడా మానలేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎం హోదాలో ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిస్తే.. దానికి కూడా కేసులు కొట్టివేయించుకునేందుకు అంటూ టీడీపీ నేతలు విమర్శించారు.

అయితే నిజంగా నేడు  లోకేశ్ ఆ కేసులు గురించే కేంద్ర మంత్రులను కలవడం విధిరాత అంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు. టీడీపీ నేతలు జగన్ పై  కేవలం ఆరోపణలు మాత్రమే చేశారు. కానీ లోకేశ్ నేడు నిజంగానే కేసులు అంశంపైనే కేంద్ర మంత్రులను కలిశారు. ఈ రోజు సీఎం జగన్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నాడంటూ గగ్గోలు పెడుతున్న లోకేశ్ కి గతం గుర్తులేదా అంటూ వైసీపీ నేతలు మండి పడుతున్నారు. నాడు జగన్ పై ఏమైతే నిందాలు వేశారో.. నేడు అవి నిజంగా లోకేశ్, చంద్రబాబు అనుభవిస్తున్నారు. మరి.. కేంద్ర మంత్రిని లోకేశ్ కలవడంపై సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి