iDreamPost

సాకారం కాని చంద్రబాబు కలల్నీ జగన్‌ సాకారం చేయాలా..?

సాకారం కాని చంద్రబాబు కలల్నీ జగన్‌ సాకారం చేయాలా..?

అమరావతిలో రాజధాని అంటూ చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపిచారు. హైదరాబాద్‌లో రాజధాని ప్రాంతం అంతూ 500 నుంచి 2 వేల ఎకరాల్లోనే ఉంది. ఆ లెక్కన అమరావతికి 1000 ఎకరాలు సరిపోతాయి. అలాంటిది 33 వేల ఎకరాలు ఎందుకు..? ఇదే మాట ఆ రోజు రాజధాని ప్రాంత గ్రామ ప్రజలు చంద్రబాబును ప్రశ్నించాల్సింది..?’ అని సినీ రచయిత చిన్ని కృష్ణ పేర్కొన్నారు. ఆ రోజు ఇలా చేయకుండా రాజధాని ప్రాంత గ్రామ ప్రజలు ఇప్పుడు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. సాకారం కాని చంద్రబాబు కలల్నీ జగన్‌ సాకారం చేయాలా..? అని చిన్ని కృష్ణ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పై వ్యాఖ్యాలు చేశారు.

అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరిస్తే ఏం జరుగుతుందో హైదరాబాద్‌ పెద్ద గుణపాఠం నేర్పిందని చిన్ని కృష్ణ అన్నారు. ఆలాంటి తప్పు మరోసారి జరగకుండా సీఎం జగన్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారని కొనియాడారు. అభివృద్ధి వికేంద్రీకరణను సీఎం జగన్‌ చక్కగా చేసేందుకు సంకల్పించారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

నవ్యాంధ్ర రాజధాని ఎక్కడ..? అనేది దేశ స్వాతంత్య్రం కంటే పెద్ద సమస్యగా కొంత మంది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వారు గత ఐదేళ్లలో ప్రచారంతోనే సరిపెట్టారు. భార™Œ దేశంలో అతిపెద్ద కుంభకోణం అమరావతిలో జరిగిందని ఆరోపించారు. దీన్ని ప్రజలు బాగా గమనించి, కల్లబొల్లి మాటలు వినకుండా గత ఎన్నికల్లో ప్రజలు చాలా క్లారిటీగా తీర్పు ఇచ్చారని చిన్నికృష్ణ గుర్తు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి