iDreamPost

చంద్రబాబు నాయుడుపై AP CID చార్జిషీట్ దాఖలు!

Inner Ring Road Scam: ఆంధ్రప్రదేశ్ లో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌ కేసు మరోమారు తెరపైకి వచ్చింది.. గురువారం ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది.

Inner Ring Road Scam: ఆంధ్రప్రదేశ్ లో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌ కేసు మరోమారు తెరపైకి వచ్చింది.. గురువారం ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది.

చంద్రబాబు నాయుడుపై AP CID చార్జిషీట్ దాఖలు!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌ కేసు సంచలనం రేపింది. గత ప్రభుత్వం అధికారంలో ఉండి లింగమనేని రియల్ ఎస్టేట్ సంస్థలకు లాభం చేకూర్చడం కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేశారని.. దీని వల్ల చాలా మంది రైతులు నష్టపోయారని సీఐడీ దర్యాప్తులో వెల్లడయ్యింది.ఈ కేసులో ఏ1 గా చంద్రబాబు నాయుడు, ఏ2 గా మాజీ మంత్రి నారాయణకు సీడ్ క్యాపిటల్ భూములు దక్కాయని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉంటే..  ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి ఇది పెద్ద దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఏపీ సీఐడి చార్జ్ షీట్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే..

ఏపీలో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత రాజకీయల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తర్వలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టీడీపీకి ఈ కేసు మింగుడు పడకుండా ఉంది. తాజాగా ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో గురువారం చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలైన ఏ1 గా చంద్రబాబు, ఏ2 గా మాజీ మంత్రి నారాయణ ఉన్న విషయం తెలిసిందే. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్ లను ముద్దాయిలుగా సీఐడీ పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారంలో నాటి చంద్రబాబు సర్కార్ సింగపూర్ తో చేసుకున్న తప్పుడు ఒప్పందం అని సీఐడీ తేల్చింది.

రాజధాని అమరావతి పేరుతో మాజీ సీఎం చంద్రబాబు హయాంలో ఎంతో అవినీతి చోటు చేసుకుందో ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి తెలిసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అంతా బాబు కను సన్నల్లో జరిగింది. నాడు చంద్రబాబు నాయడే సీఆర్‌డీఏ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ని లింగమనేని, హెరిటేజ్, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్లు సీఐడీ చార్జ్ షీట్ లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. ఇక టింగమనేని 340 ఎకరాల భూమి బ్యాంక్ కి మేలే చేసేలా అలైన్ మెంట్ లో మార్పులు చేశారు. ఇలా టీడీపీ హయాంలో ఎన్నో కుంభకోణాలకు పాల్పపడినట్లు సీఐడీ వెల్లడించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో 3000 కోట్ల రూపాయలకు పైగా మనీ లాండరింగ్ పాల్పపడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు గత ఏడాది 50 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో గడిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి