ఆంధ్రప్రదేశ్‌లో అందరి దృష్టంతా ఇప్పుడు ఒక్కటే స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇటు రాజకీయ నాయకులతో పాటు గ్రామాల నుంచి పట్టణాల దాకా అందరూ ఈ ఎన్నికలపైనే దృష్టి సారించారు. అయితే ఆ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరిలో టెన్షన్ కనిపించడం లేదంట.. గెలుపుపై ధీమా పెట్టుకొని దర్జాగా ఉన్నారంట.. ఇంతకీ ఏంటా జిల్లా అనుకుంటున్నారా.. వై ఎస్ ఆర్ కడప జిల్లాలో ఇప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉందంట. అవును రాష్ట్రమంతా ఎన్నికల టెన్షన్ వాతావరణం కనిపిస్తున్నా […]
సోమవారం…అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, స్వీట్ చిక్కీ, మంగళవారం…పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం…వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ, గురువారం…కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు, శుక్రవారం…అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ, శనివారం…అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్…! అబ్బా ఏముందిలే మెనూ…! కాస్త ఆ హోటల్ అడ్రస్ ఎక్కడో చెప్తారా అని అడిగేరు…! ఇది ఏపీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మేనమామ హోదాలో సీఎం జగన్మోహన్రెడ్డి […]
ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారిగా వైఎస్ జగన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు హాజరైన నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అనేక అనుమానాలు, అంచనాలు పటాపంచలయ్యేలా ప్రశాంతంగా విచారణ ముగిసింది. ఉదయం 10:30 గంటల సమయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులతో కలసి సీఎం జగన్ నాంపల్లిలోని కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. గతంలో తన […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర పుటల్లో మైలురాళ్ళుగా నిలిచిపోయే ఘట్టాల్లో వై.యస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఒకటి. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఆ మహా సుదీర్ఘ పాదయాత్ర ముగిసి నేటికి సరిగ్గా ఏడాది. నాడు జగన్ పాదయాత్ర చేయడానికి దారి తీసిన పరిణామాలు, మహా పాదయాత్ర వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల జీవన విధానం ఎంత అధమస్థాయికి వెళ్ళి, వారు ఎలాంటి భాదలు పడుతున్నారో, తెలుగుదేశం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా […]
ఆంధ్రప్రదేశ్ కి చెందిన 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ చెరలో చిక్కి సుమారు 14 నెలల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దేశం కానీ దేశంలో వారంతా జైళ్లలో మగ్గాల్సి వచ్చిన దుస్థితి గురించి ఆలోచించే తీరిక చాలామంది నేతలకు కనిపించ లేదు. సుదీర్ఘకాలంగా ఈ సమస్య ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్లలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. అది కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా […]
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, హైదరాబాద్‌ను చూసి చంద్రబాబు అమరావతి వాత పెట్టుకున్నాడు. ఆయనకు పోయిందేమీ లేదు కానీ, రైతులకి బొబ్బలెక్కి ఒళ్లు కాలింది. హైదరాబాద్‌కి వందల ఏళ్ల చరిత్ర ఉంది. రాజధాని కాక ముందే అదో పెద్ద నగరం. తర్వాత వలసలు పెరగడం, విద్య, ఉపాధి కోసం లక్షల మంది వచ్చి చేరడంతో దేశంలోనే పెద్ద నగరాల్లో ఒకటిగా మారింది. పాలకుల తప్పు ఏమంటే హైదరాబాద్ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి రాష్ట్రంలోని […]
ఈ రోజు బుధవారం జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పండింది. ముందుగానే నిర్ణయించిన ఈ సమావేశం వాయిదా పడడం, తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆసక్తిగా మారింది. మంత్రివర్గ భేటీ వాయిదా పడడానికి గల కారణాలను రాజకీయ నేతలు, మీడియా, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా ఎవరికి వారు తమకు తోచినట్లు ఊహించుకుంటున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు, అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ చేపట్టాలని ఓ వైపు అధికార పార్టీ.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని […]
రాజధాని అన్నది ఒకరి కల కాదు, ఒక రాష్ట్రపు (లేదా దేశపు) పాలనాపరమైన అవసరం మాత్రమే. కానీ దాన్ని ఒకరి కలగా, ఒక ప్రతిష్టాత్మకమైన అంశంగా చిత్రీకరిస్తున్నారు. సంవత్సరానికి మూడు పంటలు పండే వేలాది ఎకరాలను రాజధాని పేరుతో ఆక్రమించబోయిన చర్య దిద్దుబాటుకు నోచుకుంటుంటే గర్హిస్తున్నారు. పలు అధ్యయనాల అనంతరం నిపుణుల కమిటీలు ఇచ్చిన సూచనలను తోసిరాజని, ఇటువంటి అంశాలలో అనుభవం కానీ నైపుణ్యం కానీ లేని నారాయణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రాతిపదికగా అమరావతి ప్రాంతం […]
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకే అధికారులు, మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ మొగ్గు చూపింది. జీఎన్‌రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు ఆర్థిఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన హైవపర్ కమిటీ ఈ మేరకు రెండు కమిటీలపై ప్రాథమికంగా చర్చించింది. రాష్ట్రంలో ప్రజలు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ పై ప్రజల్లో జరుగుతున్న చర్చపై సమావేశంలో చర్చించారు. ప్రజల మనోభావాలను గౌరవించి పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామన్నారు. రెండు నివేధికలపై […]
చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో ధర్నా చేయాలంటే పోలీసుల ముందస్తు అరెస్టులు, నిరసన తెలపాలంటే కేసులకు సిద్ధపడాల్సిందే. ఈ విషయాన్ని నాటి సీఎంగా చంద్రబాబు కూడా చెప్పేశారు. ఇప్పుడు ప్రజా ఉద్యమాలను నిర్బంధంతో అణచివేయలేరిన చెబుతున్న బాబు, అప్పట్లో అధికారం ఉండడంతో తుందుర్రు వంటి గ్రామాల్లో మహిళలను అర్థరాత్రి రోడ్ల మీద ఈడ్చిన దాఖలాలున్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే సచివాలయం సమీపంలోకి ఎవరు రావాలని ప్రయత్నించినా సీరియస్ యాక్షన్ ఉండేది. అంతేకాదు చంద్రబాబు ఏ జిల్లాకు […]