iDreamPost

పవన్ పార్టీ ఎందుకు పెట్టారు? పావలా సీట్లు కూడా తెచ్చుకోలేదు: మంత్రి రోజా

Minister Roja On TDP- Janasena: టీడీపీ- జనసేన ఉమ్మడి జాబితా విడుదల చేయడంపై మంత్రి రోజా స్పందించారు. అసలు పవన్ కల్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Minister Roja On TDP- Janasena: టీడీపీ- జనసేన ఉమ్మడి జాబితా విడుదల చేయడంపై మంత్రి రోజా స్పందించారు. అసలు పవన్ కల్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పవన్ పార్టీ ఎందుకు పెట్టారు? పావలా సీట్లు కూడా తెచ్చుకోలేదు: మంత్రి రోజా

తెలుగుదేశం పార్టీ- జనసేన ఉమ్మడి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు టీడీపీ పార్టీ కేటాయించింది. ఇందుకు సంబంధించి రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రెస్ మీట్ కూడా పెట్టి ప్రకటించింది. వీళ్ల ఉమ్మడి జాబితాపై మంత్రి రోజా స్పందించారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు కేటాయించిన సీట్లు, జనసేన కార్యకర్తలు, నాయకుల అసంతృప్తికి సంబంధించి మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కల్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలంటూ రోజా డిమాండ్ చేశారు.

మంత్రి రోజా మాట్లాడుతూ.. “టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా చూసిన తర్వాత మా పార్టీ నినాదం.. వైనాట్ 175 రీచ్ అవుతాం అనే నమ్మకం పెరిగింది. ఏదైనా పార్టీ జాబితా విడుదల చేశాక నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు. అదేంటో.. టీడీపీ- జనసేన జాబితా విడుదల చేశాక.. వాళ్ల కార్యకర్తలు ఏడుస్తున్నారు. కానీ, వైసీపీ  నాయకులు, కార్యకర్తలు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ జాబితా చూసిన తర్వాత అసలు పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు.. జనసేన నాయకులు, కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదు. పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం సీట్లు కూడా తెచ్చుకోలేకపోయాడు.

ఇవాళ ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు.. పవర్ లేని స్టార్ అని. 2019లో పవన్ కల్యాణ్ మీటింగ్ లో చెప్పారు. జనసేన అంటే 10, 15 సీట్లను కుక్క బిస్కెట్లలా వేస్తే తోక ఊపుకుంటూ మన వెనుక తిరుగుతారు అని టీడీపీ వాళ్లు అవమానిస్తున్నారు. మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ.. మనం ఎవరి బిస్కెట్లకు తల వంచం అన్నారు. మరి.. ఈరోజు 24 సీట్లకు ఎందుకు తోక ఊపుకుటూం ఒప్పుకున్నారు? పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా తెలియని దుస్థితి ఇవాళ వారికి ఏర్పడింది. రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారు. ప్రజల డబ్బును స్కాములతో చంద్రబాబు దోచుకున్నారు.

ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియని గందరగోళం వారిది. రాష్ట్ర భవిష్యత్ గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. సీఎం సీఎం అని అరిచే ఆ పిచ్చి సైకోలకు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ నాయకుడు కాదు. అతనికి పార్టీ నేతలు, కార్యకర్తల మీద గౌరవం లేదని గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. ఒక కార్యకర్త, నాయకుడు గౌరవంగా ఉండాలంటే.. అది వైసీపీలో జగనన్న నాయకత్వంలోనే కుదురుతుంది. సొంత జెండా, సొంత అజెండాతో ప్రజలకు మంచి చేస్తూ.. నేను వైసీపీ నాయకుడిని, నేను వైసీపీ కార్యకర్తని అని చెప్పుకునే విధంగా జగన్ పరిపాలిస్తున్నారు.

వైసీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలు, వార్డుల్లోకి కాలర్ ఎగరేసుకుని వెళ్తుంటే.. టీడీపీ- జనసేన కార్యకర్తలు, నాయకులు.. గ్రామాలు, వార్డుల్లోకి వెళ్లడానికి భయపడే పరిస్థితి ఉంది. చంద్రబాబు ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడలేదు. ఇంక పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియని పరిస్థితి. పార్టీ పెడతాడు పోటీ చేయడు. సింగిల్ గా పోటీ చేస్తే రెండు చోట్లా ఓడిపోతాడు. ఓవైపు ఎన్డీఏతో పొత్తులో ఉన్నాను అంటాడు. ఇక్కడేమో బీజీపీతో సంబంధం లేకుండా టీడీపీతో పొత్తులో ఉండటం చూస్తుంటే.. ఇతనికి ఏమైనా విలువలు ఉన్నాయా అని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో చంద్రబాబు కోర్టులో అన్నారు. నాకు ఆరోగ్యం బాలేదు రెస్ట్ కావాలి అని. మొన్న కుప్పంలో ఆయన సతీమణి చెప్పారు.. మా ఆయనకు రెస్ట్ కావాలి అని. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు పాలిటిక్స్ నుంచి శాశ్వంతగా రెస్ట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి