iDreamPost

GT vs RCB: షారుఖ్ ఖాన్ థండర్ ఫిఫ్టీ.. నెహ్రా రియాక్షన్ వైరల్!

ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ యంగ్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ థండర్ ఫిఫ్టీ బాదాడు. దీంతో కోచ్ నెహ్రా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఇచ్చిన రియాక్షన్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ యంగ్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ థండర్ ఫిఫ్టీ బాదాడు. దీంతో కోచ్ నెహ్రా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఇచ్చిన రియాక్షన్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

GT vs RCB: షారుఖ్ ఖాన్ థండర్ ఫిఫ్టీ.. నెహ్రా రియాక్షన్ వైరల్!

ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ షారుఖ్ ఖాన్ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 45 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన దశలో సాయి సుదర్శన్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే కేవలం 24 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు షారుఖ్.  ఇది అతడికి తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. దాంతో గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ గా మారింది. బ్యాటింగ్ ఆర్డర్ లో షారుఖ్ ను ముందుకు పంపి నెహ్రా విజయం సాధించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ షారుఖ్ ఖాన్ సూపర్ ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. 45 పరుగులకే కెప్టెన్ శుబ్ మన్ గిల్(16), వృద్ధిమాన్ సాహా(5) వెనుదిరగడంతో క్రీజ్ లోకి వచ్చాడు షారుఖ్. వచ్చిన అప్పటి నుంచే ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు షారుఖ్. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఔరా అనిపించాడు. సాయి సుదర్శన్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో భారీ స్కోర్ సాధించింది.

ఇక ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 30 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సులతో 58 పరుగులు చేసి.. మంచి టచ్ లో కనిపించాడు. కానీ మహ్మద్ సిరాజ్ సంధించిన అద్భుతమైన యార్కర్ కు ఔట్ అయ్యాడు. షారుఖ్ ఫిఫ్టీ సాధించిన తర్వాత కోచ్ నెహ్రా ఇచ్చిన రియాక్షన్స్ వైరల్ గా మారాయి. అద్భుతంగా ఆడావు, సూపర్ అంటూ బౌండరీ లైన్ దగ్గర నుంచి నెహ్రా కితాబిచ్చాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు చేసి షారుఖ్ ను ముందు పంపించి విజయం సాధించాడు నెహ్రా. సాయి సుదర్శన్ సైతం ఈ మ్యాచ్ లో సూపర్ ఫిఫ్టీ చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి