iDreamPost

చంద్రబాబుకు మరో షాక్.. TDPకి గుడ్ బై చెప్పిన లింగమనేని

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు లీడర్లు పార్టీని వీడగా.. తాజాగా మరో నేత పార్టీకి రాజీనామా చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు లీడర్లు పార్టీని వీడగా.. తాజాగా మరో నేత పార్టీకి రాజీనామా చేశారు.

చంద్రబాబుకు మరో షాక్.. TDPకి గుడ్ బై చెప్పిన లింగమనేని

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న వేళ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. టీడీపీలో ఉన్న సీనియర్ లీడర్లు పార్టీని వీడుతుండడంతో చంద్రబాబుకు షాక్ తగులుతోంది. ఈ క్రమంలో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత లింగమనేని శివరామ ప్రసాద్ పార్టీ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కొనసాగిన లింగమనేని ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని వీడడంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. లింగమనేని శివరామ ప్రసాద్ తన రాజీనామా లేఖను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

లింగమనేని శివరామ ప్రసాద్ తన రాజీనామా లేఖలో.. సుదీర్ఘ అనుబంధానికి తెర పడిన రోజు. అందరూ అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. మార్చి 29, 1982న హైదరాబాద్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అన్న నందమూరి తారక రామారావు గారి స్పూర్తితో తెలుగుదేశం పార్టీతో నాకు ఏర్పడిన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యక్తిగత కారణాలతో నేను పార్టీ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి (36460216) రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు, శ్రీ నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను, వెంటనే నా రాజీనామాను ఆమోదించ వలసిందిగా కోరుచున్నానని లింగమనేని శివరామ ప్రసాద్ ప్రకటించారు.

కాగా ఇప్పటికే రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ సీనియర్‌ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. చంద్ర బాబు విధానాలు నచ్చక విసిగెత్తిపోయిన లీడర్లు పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. చంద్ర బాబు వెన్నుపోటు రాజకీయాలు, స్వార్థపూరిత ధోరణి టీడీపీ లీడర్లను పార్టీ వీడేలా చేస్తున్నాయి. సొంత సామాజిక వర్గం నుంచి తగులుతున్న షాకులతో టీడీపీ కుదేలవుతుంది. టీడీపీ రాజకీయ పార్టీ కాదు. వ్యాపార సంస్థ అంటూ రాయపాటి తీవ్ర విమర్షలు చేశారు. మరి లింగమనేని టీడీపీని వీడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి