iDreamPost

పంచె కట్టుకుంటే పడిపోతానేమోనని భయమేసింది…కానీ

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయన సినిమాలే కాదూ.. ఎన్నో సేవా గుణాలు చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని తన మనస్సులో మాటలు పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయన సినిమాలే కాదూ.. ఎన్నో సేవా గుణాలు చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని తన మనస్సులో మాటలు పంచుకున్నారు.

పంచె కట్టుకుంటే పడిపోతానేమోనని భయమేసింది…కానీ

పంచెకట్టు రోజులు ఎఫ్పుడో పోయాయి. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఆ అలవాటు రోజులు, అలవాట్లు మారిపోతున్న కొద్దీ, కట్టూబొట్టూ వంటి సంప్రదాయాలో పూర్తిగా మార్పులు వచ్చేశాయి. అది ఎవరి తప్పు కాదు. మారుతున్న కాలానుగుణంగా ఈ మార్పులు తప్పనిసరిగా వచ్చేశాయి. అందులో ముఖ్యంగా కట్టుకునే బట్టలలో చెప్పలేనంత వైవిద్యం వచ్చేసి, పాతకాలపు పోకడలు మాయమైపోయాయి. ఇప్పుడు కొత్తగా ఎప్పుడూ లేని అలవాటు, పంచెకట్టుకోవాలంటే మెగాస్టార్‌ చిరంజీవికి ఇబ్బంది అనిపించింది. అదే ఆయన వైజాగ్‌లో జరిగిన ఎన్టీఆర్‌ పుణ్యతిథి కార్యక్రమానికి హాజరైనప్పుడు వ్యక్తం చేశారు.

‘‘నాకెప్పుడూ పంచెకట్టుకునే అలవాటు లేదు. ఎప్పుడో పూజలు చేసుకునేటప్పుడు తప్పితే. కానీ కొన్ని సందర్బాలలో అవెంత తప్పనిసరి అవుతాయో నాకీ కార్యక్రమానికి వచ్చినప్పుడే అర్ధమైంది. ఏ డ్రస్ వేసుకోవాలీ అనుకున్నప్పుడు మామ్మూలు ఫ్యాంట్, షర్టు వేసుకుంటే బావుండదు అనిపించింది. సరే…ఇంక పంచె కట్టుకుందామని డిసైడ్‌ అయిపోయాను. కానీ పంచె కాళ్ళల్లో పడి పడిపోతానేమోననే భయం కూడా వేసింది(నవ్వుతూ). ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంటే ఏదో తెలియని అనుభూతి. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ లాంటి మహానుభావులతో కలసి పనిచేసే అదృష్టం నాకు లభించడాన్ని నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. ఇద్దరి దగ్గర్నుంచీ ఎంతో నేర్చుకున్నాను. వాళ్ళు జీవితాన్ని చాలా నిశితంగా,దూరదృష్టితో చూసి అందుకు తగినట్టుగా జీవితాలను ఆదర్శప్రాయంగా మలుచుకున్నారు. అందరికీ ఒక ఉదాహరణగా నిలబడ్డారు. ఎన్టీఆర్‌తో తిరుగులేని మనిషి, ఏఎన్నార్‌తో మెకానిక్ అల్లుడు సినిమాలు చేశాను. ఆ అనుభవాలను ఎప్పటికీ మరచిపోలేను.’’ అని చెప్పారు చిరంజీవి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి