iDreamPost

విమానం ఎక్కనంటున్న చంద్రబాబు..

విమానం ఎక్కనంటున్న చంద్రబాబు..

అధికారంలో ఉన్నప్పుడు ఎటునుంచి ఎటు వెళ్లాలన్నా.. ఎంత దూరమైన.. ఏ చిన్న కార్యక్రమంలో పాల్గొనాలన్న ముఖ్యమంత్రి హోదాలో అధికార, అనధికార పర్యటనలకు ప్రత్యేక విమానంలో మాత్రమే వెళ్లే చంద్రబాబు కు ఆ విషయంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దానికి భద్రతా కారణాలు కావచ్చు, మరేదైనా కావచ్చు. అప్పట్లో చంద్రబాబు తన వ్యక్తిగత పర్యటనలకి కూడా ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు చంద్రబాబుపై తీవ్రంగా దుమ్మెత్తిపోసేవి.

అధికారం కోల్పోయాక, రాష్ట్ర పర్యటనలకు కూడా సాధారణంగా విమాన ప్రయాణాలకే మొగ్గుచూపే ప్రతిపక్ష నేత వైజాగ్, తిరుపతి, కర్నూల్, కడప వంటి ప్రధాన పట్టణాలకు విమానాల్లో వెళ్లి అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలకు వెళ్లేవారు. అయన రోడ్డు మార్గం ద్వారా సుదూర ప్రయాణాలు చెయ్యడం చాలా అరుదు. ప్రధానంగా గతంలో రోడ్డు మార్గంలో వెళ్తున్న అయన మీద తీవ్రవాదులు హత్యాప్రయత్నం చెయ్యడంతో భద్రతా కారణాల దృష్యా కేంద్ర ప్రభుత్వం ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరి భద్రతా కూడా కల్పిస్తుంది.

ఈ నేపథ్యం సాధారణంగా ఎప్పుడు విమానంలో హైద్రాబాద్ వెళ్లే చంద్రబాబు శుక్రవారం మాత్రం విమాన ప్రయాణాన్ని కాదని రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే ఆయన రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. విదేశాల నుండి వస్తున్న వాళ్ళతో దేశంలోని విమానాశ్రయాలలో కరోనా వైరస్ రిస్క్ ఎక్కువగా ఉండడంతో అయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చంద్రబాబు బాటలోనే ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా శుక్రవారం రోడ్డు మార్గానే హైద్రాబాద్ చేరుకోవడం విశేషం.

ఏది ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో సెలబ్రిటిస్, రాజకీయ క్రీడా ప్రముఖులు కూడా విమాన ప్రయాణాలంటే హడాలిపోతున్న వాతావరణం కనపడుతుంది. ఏ నేపథ్యంలో ప్రముఖులందరూ తమ వ్యక్తిగత ప్రయాణాలను రద్దు చేసుకొని ఇళ్లకే పరిమితమవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి