iDreamPost

బ్రేకింగ్: చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు!

Action Against Chandrababu: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సందడి జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

Action Against Chandrababu: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సందడి జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

బ్రేకింగ్: చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు!

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సంగ్రామం తారాస్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈసారి అధికార పార్టీని ఎలాగైనా గద్దె దింపాలని ప్రతి పక్ష పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీలో ఉన్నాయి. తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజలకు గుర్తు చేస్తూ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మేమంతా సిద్దం ’ బస్సు యాత్ర చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ది పథంలో ముందుకు సాగాలంటే మరోసారి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే.. బహిరంగ సభల్లో సీఎం జగన్ పై ప్రతిపక్ష నేతలు పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సీఈవోకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. వివరాల్లోకి వెళితే

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేయాలని అధికార, ప్రతిపక్ష నేతలు గట్టి పట్టుమీదే ఉన్నాయి. ఇరు పార్టీ నేతలు ప్రచారాలు ముమ్మరం చేశారు. అయితే ప్రతిపక్ష నేతలు బహిరంగ సభలో సీఎం జగన్ ని టార్గెట్ చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇప్పటి వరకు 18 సార్లు సీఈఓకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు.దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ని వివరణ ఇవ్వాలని పలు మార్లు నోటీసులు జారీ చేశారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. అయితే కొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. కొన్ని నోటీసులకు అసలు స్పందనే లేదని అన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా.

ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచార సమయంలో కొన్ని నియనిబంధనలు ఉంటాయని.. వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అంటున్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. నోటీసులపై చంద్రబాబు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేవని అన్నారు సీఈఓ మీనా. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ కి లేఖ పంపినట్లు తెలిపారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఆ లేఖతో పాటు ప్రసంగాల వీడియో క్లిప్పులను కూడా జగ చేసినట్లు తెలిపారు సీఈవో మీనా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి