iDreamPost

MS Dhoni: ధోని ఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలి.. టీమిండియా మాజీ క్రికెటర్ విమర్శలు!

  • Published May 06, 2024 | 9:55 AMUpdated May 06, 2024 | 9:55 AM

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు చేశాడు. ధోని ఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలని అన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు చేశాడు. ధోని ఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలని అన్నాడు.

  • Published May 06, 2024 | 9:55 AMUpdated May 06, 2024 | 9:55 AM
MS Dhoni: ధోని ఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలి.. టీమిండియా మాజీ క్రికెటర్ విమర్శలు!

డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న సమయంలో అద్భుతమైన గెలుపును నమోదు చేసింది గైక్వాడ్ సేన. ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో సీఎస్​కే అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన చెన్నై ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్​కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. ఈ గెలుపుతో సీఎస్​కే పాయింట్స్ టేబుల్​లో థర్డ్ ప్లేస్​కు ఎగబాకింది. అయితే చెన్నై నెగ్గినా గానీ ఎంఎస్ ధోని ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఐపీఎల్-2024లో ధోని ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చి అదరగొడుతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో 110 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 224గా ఉంది. చివరి రెండు, మూడు ఓవర్లు ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి ధనాధన్ షాట్లతో టీమ్​ భారీ స్కోర్లు అందుకోవడానికి హెల్ప్ చేస్తున్నాడు. అయితే మాహీ ఉన్న ఫామ్​కు, నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు, సిక్సులు కొడుతున్న పద్ధతికి కాస్త ముందే బ్యాటింగ్​కు వస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మోకాలి గాయం నుంచి పూర్తిగా రికవరీ అవకపోవడంతో అతడు 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్​కు దిగుతున్నాడు. నిన్న పంజాబ్​తో మ్యాచ్​లో తొమ్మిదో స్థానంలో ఆడాడు. దీంతో అతడిపై టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ విమర్శలకు దిగారు.

Former Indian cricketer criticizes Dhoni

ఎంఎస్ ధోని ఇలాగే నంబర్ 9లో బ్యాటింగ్​కు దిగాలని భావిస్తే అతడి బదులు మంచి బౌలర్​ను టీమ్​లోకి తీసుకుంటే సరిపోతుందని భజ్జీ అన్నాడు. ఆ ప్లేస్​లో ఓ బౌలర్​ను ఆడిస్తే వికెట్లు తీయడంతో పాటు ఆఖర్లో వచ్చి కొన్ని పరుగులు చేస్తాడు కదా.. అలాంటప్పుడు జట్టులో మాహీ అవసరం ఏం ఉందని ఇన్​డైరెక్ట్​గా క్వశ్చన్ చేశాడు. బ్యాటింగ్​ ఆర్డర్​లో పైకి వచ్చి ఆడలేనప్పుడు ధోని ఆడటం ఎందుకని ప్రశ్నించాడు. మాహీ ఆడటం మానేసి ఇంట్లో కూర్చోవాలని టర్బనేటర్ సూచించాడు. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్​కు రావడం చెన్నైకి మంచిది కాదని.. రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరింత ముందుకు వచ్చి ఆడాలని పఠాన్ అన్నాడు. ఒకట్రెండు ఓవర్లు ఆడితే టీమ్​కు ఏమాత్రం లాభిందని స్పష్టం చేశాడు. మరి.. ధోని ఆడటం మానేయాలంటూ భజ్జీ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి