iDreamPost

టీచర్​పై పగతో స్కూలును కొని కూల్చేసిన నటుడు.. ఏం రివేంజ్ సామి!

  • Published May 05, 2024 | 5:46 PMUpdated May 05, 2024 | 5:46 PM

టీచర్ మీద పగతో ఓ నటుడు చేసిన పని గురించి తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇదేం రివేంజ్ సామి అని ఆశ్చర్యపోకమానరు.

టీచర్ మీద పగతో ఓ నటుడు చేసిన పని గురించి తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇదేం రివేంజ్ సామి అని ఆశ్చర్యపోకమానరు.

  • Published May 05, 2024 | 5:46 PMUpdated May 05, 2024 | 5:46 PM
టీచర్​పై పగతో స్కూలును కొని కూల్చేసిన నటుడు.. ఏం రివేంజ్ సామి!

ఏ మనిషైనా ఎంత ఎదిగినా, ఎంత జీవితం చూసినా చిన్ననాటి రోజుల్ని మాత్రం మర్చిపోలేరు. చైల్డ్​హుడ్ మెమరీస్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఏమీ తెలియని వయసులో ఏర్పడే స్నేహాలు, వాళ్లతో ఆడుకున్న క్షణాలు స్వీట్ మెమొరీస్ అనే చెప్పాలి. ఫ్రెండ్స్​తో పాటు స్కూల్ డేస్ కూడా అందరికీ గుర్తుండిపోతాయి. ఫేవరెట్ టీచర్, అక్కడి స్నేహితులు, కాంపిటీషన్స్​లో గెలుచుకున్న ట్రోఫీలు, మార్క్స్.. ఇలా పాఠశాల విద్యతో ఎన్నో విషయాలు ముడిపడి ఉంటాయి. అయితే ఇప్పుడు కాదు గానీ ఒకప్పుడు స్కూళ్లలో విద్యార్థుల్ని కొట్టేవారు. సరిగ్గా చదవకపోయినా, మార్కులు తగ్గినా బెత్తం తీసుకొని రెండు తగిలించడం కామన్. అలా కొట్టిన టీచర్లను కూడా స్టూడెంట్స్ ఎప్పుడూ మర్చిపోరు.

చిన్నప్పుడు మనల్ని కొట్టిన టీచర్లు పెద్దయ్యాక కనిపిస్తే మళ్లీ అంతే వినమ్రతతో నమస్కరిస్తాం. వాళ్లు అంటే ఎప్పటికీ ఆ భయభక్తులు, గౌరవం ఉంటాయి. కానీ కొందరికి మాత్రం తమను శిక్షించిన ఉపాధ్యాయులు అంటే గిట్టదు. వాళ్ల ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. టర్కీకి చెందిన ఓ ప్రముఖ నటుడు కూడా ఆ కోవలోకే వస్తాడు. ఆయన పేరు కగ్లర్ ఎర్తుగ్రుల్. ఎలిమెంట్రీ స్కూల్​లో ఉన్నప్పుడు ఓ టీచర్ అతడ్ని బాగా కొట్టేవాళ్లట. ఆ తర్వాత పెరిగి పెద్దవాడయ్యాక కూడా ఆ దెబ్బల్ని మర్చిపోలేదట కగ్లర్. యాక్టర్​గా మంచి ఫేమ్, క్రేజ్, డబ్బుల్ని కూడా బాగా సంపాదించాడు. దీంతో ఆ టీచర్​పై రివేంజ్ తీర్చుకోవాలని భావించాడు.

ఏ స్కూల్​లోనైతే పాఠాలు చెబుతూ తనను టీచర్లు కొట్టేవాళ్లో దాన్ని ఇటీవల కొన్నాడు కగ్లర్. అయితే అంతవరకు బాగానే ఉన్నా ఆ టీచర్​పై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా ఆ పాఠశాల భవనాన్ని కూల్చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టాడు. తనను టీచర్లు బాగా కొట్టేవారని, అందుకే ఆ స్కూలును కొని కూల్చేశానని అన్నాడు కగ్లర్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఇదేం రివేంజ్ సామి అని అంటున్నారు. విద్యార్థులు మంచి దారిలోకి రావాలనే టీచర్లు కొడతారని, దానికి ఇలా ప్రతీకారం తీర్చుకోవడం ఏంటని షాకవుతున్నారు. ఆ భవనాన్ని ఏదైనా మంచి పనికి వాడుంటే బాగుండేదని, కూల్చివేతతో ఏం సాధించావని కొందరు నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. మరి.. టీచర్​పై కోపంతో స్కూలు భవనాన్ని కొని కూల్చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by fasak.boss (@fasakboss)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి