iDreamPost

కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌! కోర్టులో నిజం ఒప్పుకున్న కంపెనీ!

  • Published Apr 30, 2024 | 11:57 AMUpdated Apr 30, 2024 | 11:57 AM

Covishield, Covid 19: కరోనా సమయంలో ఇండియాలో విరివిగా ఉపయోగించిన కోవిషీల్డ్‌ టీకా గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆ టీకాను తయారు చేసిన కంపెనీ కోర్టులో నిజం ఒప్పుకుంది.

Covishield, Covid 19: కరోనా సమయంలో ఇండియాలో విరివిగా ఉపయోగించిన కోవిషీల్డ్‌ టీకా గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆ టీకాను తయారు చేసిన కంపెనీ కోర్టులో నిజం ఒప్పుకుంది.

  • Published Apr 30, 2024 | 11:57 AMUpdated Apr 30, 2024 | 11:57 AM
కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌! కోర్టులో నిజం ఒప్పుకున్న కంపెనీ!

కరోనా మహమ్మారీ సమయంలో కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకాలు వేయించింది. అందులో కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకాలను చాలా మంది వేయించుకున్నారు. అయితే.. కరోనా కంట్రోల్‌ అయిన తర్వాత.. టీకాలు వేయించుకున్న వారిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించాయి. చాలా మంది గుండెపోటుతో మరణించారు. దీంతో.. టీకాలు వేయించుకోవడంతోనే గుండెపోటు వస్తుందని ప్రచారం జరింది. ఈ క్రమంలోనే కోవిషీల్డ్‌తో అరుదైన దుష్ప్రభావాలు తలెత్తుతాయని బ్రిటిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. కోవిషీల్డ్ కారణంగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి పరిస్థితికి కారణమవుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడ్‌విట్‌లో ఆస్ట్రాజెన్‌కా పేర్కొన్నట్టు బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ను మన దేశంలోని పుణేలో గల సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే.

అనేక మంది మరణాలకు కారణమైందని కోవిషీల్డ్‌ టీకాపై కోర్టులో దాదాపు 51 కేసులు విచారణలో ఉన్నాయి. కోవిషీల్డ్‌పై మొట్టమొదటి సారి జామీ స్కాట్ అనే వ్యక్తి కేసును వేశాడు. ఏప్రిల్ 2021లో తనకు వ్యాక్సిన్ అందిందని, దీని వల్ల రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని అతడు ఆరోపించారు. టీకా వల్ల తాను లేవలేని పరిస్థితికి చేరుకున్నానని, తాను చనిపోతానని వైద్యులు తన భార్యకు మూడుసార్లు చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా మొదట్లో తోసిపుచ్చింది. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన నివేదకలో ‘కోవిషీల్డ్ చాలా అరుదైన సందర్భాల్లో TTS(థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్)కి కారణమవుతుంది’ అని అంగీకరించింది. కరోనా టీకాలు తీసుకున్నవారిలో గుండెపోటు వంటి పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్టు అనేక అధ్యయనాల్లోనూ వెల్లడైన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సాక్ష్యాత్తు టీకా తయారు చేసిన కంపెనీనే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని కోర్టులో ఒప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలయజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి