iDreamPost

Virat Kohli: యువ క్రికెటర్లకే రూల్స్‌..? కోహ్లీకి వర్తించవా?

  • Published May 06, 2024 | 9:13 AMUpdated May 06, 2024 | 9:13 AM

గేమ్​లో రూల్స్ అంటే అందరికీ ఒకేలా వర్తించాలి. ఎవరు దాన్ని అధిగమించినా శిక్ష పడాల్సిందే. కానీ యంగ్ క్రికెటర్స్​కు ఒకలా.. స్టార్లకు ఒకలా అన్నట్లు నిబంధనల విషయంలో వేర్వేరుగా ప్రవర్తిస్తే విమర్శలు తప్పవు.

గేమ్​లో రూల్స్ అంటే అందరికీ ఒకేలా వర్తించాలి. ఎవరు దాన్ని అధిగమించినా శిక్ష పడాల్సిందే. కానీ యంగ్ క్రికెటర్స్​కు ఒకలా.. స్టార్లకు ఒకలా అన్నట్లు నిబంధనల విషయంలో వేర్వేరుగా ప్రవర్తిస్తే విమర్శలు తప్పవు.

  • Published May 06, 2024 | 9:13 AMUpdated May 06, 2024 | 9:13 AM
Virat Kohli: యువ క్రికెటర్లకే రూల్స్‌..? కోహ్లీకి వర్తించవా?

ఆటలోనైనా నిబంధనలు తీసుకొస్తున్నారంటే ఆడియెన్స్ ఎక్స్​పీరియెన్స్​ను మరింత బెటర్​ చేయడం కోసమేనని చెప్పాలి. ప్లేయర్లు అందరికీ సమన్యాయం జరగడం కోసం అదే విధంగా వాళ్లలో క్రమశిక్షణ తీసుకొచ్చేందుకు, అలాగే గేమ్​ను మరింత ఇంట్రెస్టింగ్​గా మార్చేందుకు ఈ రూల్స్ ఉపయోగపడతాయి. రూల్స్ అంటే అందరికీ ఒకేలా వర్తించాలి. ఎవరు దాన్ని అధిగమించినా శిక్ష పడాల్సిందే. కానీ యంగ్ ప్లేయర్లకు ఒకలా.. స్టార్లకు ఒకలా అన్నట్లు నిబంధనల విషయంలో వేర్వేరుగా ప్రవర్తిస్తే విమర్శలు తప్పవు. ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు పరిస్థితి అలాగే ఉంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే బీసీసీఐకి ఎందుకంత భయం? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కోహ్లీ అంటే బీసీసీఐకి ఎందుకంత భయం? యంగ్ క్రికెటర్స్​కు ఓ విధంగా విరాట్​కు మరో విధంగా రూల్స్ ఉంటాయా? విరాట్​కు నిబంధనలు వర్తించవా? అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనంతటికీ కారణం కోల్​కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా ఉదంతమే. ఐపీఎల్-2024 సీజన్ మొదట్లో సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో మయాంక్ అగర్వాల్​ను ఔట్ చేశాడు రాణా. అయితే వికెట్ తీసిన ఆనందంలో బ్యాటర్​ను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో ఆ మ్యాచ్ తర్వాత అతడికి మ్యాచ్​ ఫీజులో కోత విధించారు. అయినా ఆగని హర్షిత్ రీసెంట్​గా ఇంకో మ్యాచ్​లో బ్యాటర్​కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వబోతూ ఆగిపోయాడు. దీంతో అతడి మీద 100 శాతం మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఓ మ్యాచ్​లో ఆడకుండా బ్యాన్ విధించారు.

హర్షిత్ రాణాలాగే గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్​లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ కూడా ప్లయింగ్ కిస్ ఇచ్చాడు. కానీ అతడిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మ్యాచ్ ఫీజులో కోత విధించడం, సస్పెన్షన్ లాంటివి కాదు కదా.. కనీసం అతడికి వార్నింగ్ కూడా ఇవ్వలేదు. దీంతో హర్షిత్ వంటి యంగ్​స్టర్స్​కేనా? కోహ్లీకి రూల్స్ వర్తించవా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. బీసీసీఐకి విరాట్ అంటే భయమని.. అందుకే అతడి మీద చర్యలు తీసుకోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం హర్షిత్ రాణా బ్యాటర్​కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడని.. కానీ కోహ్లీ ఆడియెన్స్​కు ఇచ్చాడని.. అది నేరం కిందకు రాదని, అందుకే చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ఏదేమైనా ఫ్లయింగ్ కిస్ వివాదం మాత్రం ఐపీఎల్​ను ఊపేస్తోంది. మరి.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ కాంట్రవర్సీపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Chaduvukondi Firstu🇮🇳 (@chaduvkondi_firstu)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి