iDreamPost

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో రిస్క్.. సుప్రీంకోర్టులో లాయర్ పిటిషన్

  • Published May 02, 2024 | 4:19 PMUpdated May 02, 2024 | 4:19 PM

Covishield : ప్రస్తుతం దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఈ కోవిషీల్డ్‌ టీకా గురించి రకరకాల వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎందుకంటే..ఈ కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడం వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌ ఉంటాయని స్వయంగా.. ఆ టీకా తయారు చేసిన కంపెనీ అయిన ఆస్ట్రాజెనెకా అంగీకరించడమే ప్రధాన కారణం. ఈ క్రమంలోనే ఓ న్యాయవాది కోవీషీల్డ్ వ్యాక్సిన్ రిస్క్ లపై సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ వేశారు.

Covishield : ప్రస్తుతం దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఈ కోవిషీల్డ్‌ టీకా గురించి రకరకాల వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎందుకంటే..ఈ కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడం వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌ ఉంటాయని స్వయంగా.. ఆ టీకా తయారు చేసిన కంపెనీ అయిన ఆస్ట్రాజెనెకా అంగీకరించడమే ప్రధాన కారణం. ఈ క్రమంలోనే ఓ న్యాయవాది కోవీషీల్డ్ వ్యాక్సిన్ రిస్క్ లపై సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ వేశారు.

  • Published May 02, 2024 | 4:19 PMUpdated May 02, 2024 | 4:19 PM
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో  రిస్క్.. సుప్రీంకోర్టులో లాయర్ పిటిషన్

కోవిషీల్డ్‌.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఈ టీకా గురించి రకరకాల వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎందుకంటే..ఈ కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడం వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌ ఉంటాయని స్వయంగా.. ఆ టీకా తయారు చేసిన కంపెనీ అయిన ఆస్ట్రాజెనెకా అంగీకరించడమే ప్రధాన కారణం. ఇక ఈ వార్త వినిపిస్తున్న నుంచి ఆ టీకా వేయించుకున్న వారిలో చాలా ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఈ టీకా వేసుకున్న వారికి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అని తెగ భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కోవిషీల్డ్ టీకా పై రకరకాల సందేహాలు, రూమార్స్ నడుస్తున్నయనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే.. ఓ న్యాయవాది కోవీషీల్డ్ వ్యాక్సిన్ రిస్క్ లపై సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మహామ్మారి కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది అమాయకులు తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. అయితే ఈ కోవిడ్ వైరస్ బారినపడిన వారికి వాటిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్లను కనిపెట్టేందుకు విశ్వ ప్రయాత్నలు చేశాయి. ఇందులో భాగంగానే కోవిషిల్డ్, కోవాక్సిన్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ కోవిషిల్డ్ తీసుకున్న వారికి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని గత రెండు రోజులుగా నెట్టింట వార్తలు హల్ చెల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఓ న్యాయవాది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిస్క్ లపై సుప్రీం కోర్టులో పిటిషన్ లు వేశారు. కాగా, అందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వాడకంలో చాలా రిస్క్ ఉన్నాయని, వాటిని వైద్య నిపుణుల చేత అధ్యయనం చేయించాలని న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా.. కోవిడ్ 19 సమయంలో టీకా డ్రైవ్ ఫలితంగా నష్టపోయిన ప్రజలకు నష్ట పరిహారం కూడా చెల్లించే విధానాన్ని అమలు చేయాలని ఆ పిటిషిన్ లో కోరారు.

ఇక మహమ్మారి సమయంలో.. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఫార్ములా ను పుణెకు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లైసెన్స్ పొందిందని.. అయితే ఈ వ్యాక్సిన్ తో రక్తం గడ్డ కట్టడానికి సంబంధిచిన దుష్ప్రభావం కలిగే అవకాశం ఉందని తివారీ తన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు. కాగా, ఇందుకు సాక్ష్యంగా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికా తన కోవిడ్ 19 వ్యాక్సిన థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ ఐటిటిఎస్ తో థ్రాంబోసిస్ కారణమవుతుందని అంగీకరించిన యూకే కోర్టు పత్రాలను కోర్టుకు సమర్పించారు. అయితే కోవిడ్ 19 తర్వాత ప్రజల్లో గుండెపోటు ఎక్కువైందని.. ముఖ్యంగా యువకుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని తివారి తన పిటిషన్ లో తెలిపారు. అయితే భారత దేశం అంతటా 175 కోట్లకు పైగ కోవిషీల్డ్ వాక్సిన్ ను అందించబడ్డాయని, దీని కారణంగా ప్లేట్ లెట్స్ పడిపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. కనుక భారత ప్రజలు ఆరోగ్యం, భద్రత ను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ లో ఆయన తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి