iDreamPost

ఎన్నికల వేళ AP ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్!

Good News for Government Employees: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.ఎన్నికల వేల ఈసీ ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

Good News for Government Employees: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.ఎన్నికల వేల ఈసీ ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

ఎన్నికల వేళ AP ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గెలుపు పై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్తూ మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అధికార పార్టీ గద్దె దింపి ఈసారి తామ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష నేతలు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈసారి జరగబోతున్న ఎన్నికలు ఇరు పార్టీల నేతలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్ కమీషన్ ఓ శుభవార్త తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించిది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జీవోఆర్టీ నెంబర్ 845 జారీ అయినట్లు ఆయన తెలిపారు. సెక్రటేరియట్ విభాగాలు, విశాఖ అధిపతి, జిల్లా కలెక్టర్లు ఇతర సంబంధిత అధికారులు దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్వర్వులో ప్రకటించారు.

ఓటర్ సౌలభ్యం కోసం కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు ఒకరోజు ప్రత్యేక క్యాజువల్ లీవ్ మంజరు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఏప్రిల్ 30న ఎన్నికల విధుల్లోకి తీసుకున్న అంగన్ వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోెగులకు పోస్టల్ బ్యాలట్ అందేలా ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే గడువు పెంచాలని ఈసీని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల వాడీ వేడిగా కొనసాగుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి