iDreamPost

టీ20 వరల్డ్‌ కప్‌లో అతని ఫామ్‌.. టీమిండియాకు ఎంతో అవసరం: సెహ్వాగ్‌

  • Published May 06, 2024 | 10:11 AMUpdated May 06, 2024 | 10:11 AM

Virender Sehwag, Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌పై భారత క్రికెట్‌ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే.. వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఆ ఒక్క క్రికెటర్‌ పెద్ద దిక్కు అంటూ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Virender Sehwag, Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌పై భారత క్రికెట్‌ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే.. వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఆ ఒక్క క్రికెటర్‌ పెద్ద దిక్కు అంటూ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published May 06, 2024 | 10:11 AMUpdated May 06, 2024 | 10:11 AM
టీ20 వరల్డ్‌ కప్‌లో అతని ఫామ్‌.. టీమిండియాకు ఎంతో అవసరం: సెహ్వాగ్‌

ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్‌ జోరు కొనసాగుతున్నా.. మరోవైపు అంతా టీ20 వరల్డ్‌ కప్‌ 2024పై కూడా ఓ కన్నేసి ఉంచారు. ఇప్పటికే భారత సెలెక్టర్లు టీ20 వరల్డ్‌ కప్‌ కోసం 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్‌ కప్‌ బరిలో దూకనుంది. 15 మంది స్క్వౌడ్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. అయితే.. ఇంత మంది ఉన్నా.. టీమిండియాకు చెందిన ఆ ఒక్క ప్లేయర్‌ ఫామ్‌లో ఉండటం టీ20 వరల్డ్‌ కప్‌లో భారత జట్టుకు ఎంతో అవసరం అంటూ టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరు? ఎందుకు అతను ఫామ్‌లో ఉండటం అంత అవసరం వంటి ఇంట్రెస్టింగ్‌ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ప్రకటించిన జట్టులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్‌ క్రికెటర్లు ఉన్నారు. వీరికి వెస్టిండీస్‌లో పలు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. కానీ, మిగతా జట్టు సభ్యులకు అక్కడ క్రికెట్‌ ఆడిన అనుభవం తక్కువ. పైగా టీ20 వరల్డ్‌ కప్‌ అనే ప్రెజర్‌ కూడా వారిపై ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో జట్టులోని సీనియర్‌ ప్లేయర్లో ఒకడైన విరాట్‌ కోహ్లీ ఫామ్‌లో ఉండటం చాలా అవసరమని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌ పిచ్‌లు కాస్త స్లోగా ఉండి, స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి పిచ్‌లపై యువ క్రికెటర్లు రాణించడం కాస్త కష్టమైన విషయం. అందుకే కోహ్లీ ఫామ్‌లో ఉంటే.. టీమిండియాకు వరల్డ్ కప్‌ గెలిచే అవకాశం ఎక్కుకగా ఉంటుంది.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత.. విరాట్‌ కోహ్లీ ఒక్క పరుగులు చేయకపోయినా పర్వాలేదు కానీ, టీ20 వరల్డ్‌ కప్‌లో మాత్రం కచ్చితంగా మంచి ఫామ్‌లో ఉండాలని సెహ్వాగ్‌ అన్నాడు. అంటే.. కోహ్లీ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు ఎంత అవసరమో సెహ్వాగ్‌ లాంటి దిగ్గజ క్రికెటర్‌ కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది. అయినా.. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ప్రస్తుతం అతనే టాప్‌ రన్‌ గెట్టర్‌గా ఉన్నాడు. 542 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ను ధరిస్తున్నాడు. కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్నా.. కోహ్లీ సామర్థ్యంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అయితే.. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌లో కూడా కోహ్లీ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని, కొనసాగిస్తాడని అంతా భావిస్తున్నారు. మరి టీమిండియాకు కోహ్లీ అవసరంపై సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి