iDreamPost

వీడియో: స్టేజ్ పై పాట పాడుతుండగా గాయనికి ఘోర అవమానం!

Sunidhi Chauhan Issue: ఈ మధ్య కాలంలో కొంతమంది ఆకతాయిలు చేస్తున్న పనుల వల్ల సామాన్య మహిళలే కాదు సెలబ్రెటీలు సైతం తీవ్ర అసౌకర్యానికి గురైతున్నారు. ఇలాంటి వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Sunidhi Chauhan Issue: ఈ మధ్య కాలంలో కొంతమంది ఆకతాయిలు చేస్తున్న పనుల వల్ల సామాన్య మహిళలే కాదు సెలబ్రెటీలు సైతం తీవ్ర అసౌకర్యానికి గురైతున్నారు. ఇలాంటి వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వీడియో: స్టేజ్ పై పాట పాడుతుండగా గాయనికి ఘోర అవమానం!

ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. దేశంలో ఎక్కడో అక్కడ కొంతమంది మగరాయుళ్ళు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం, అవమానించడం చూస్తూనే ఉన్నాం. ఈ ఇబ్బంది సామన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు. సెలబ్రెటీలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్లినపుడు వారిని అసభ్యంగా తాకడం, ఎవరైనా వేధికలపై స్పీచ్ ఇస్తున్నా.. సాంగ్స్ పాడుతున్నా ఏదో ఒక చండాలం పని చేస్తూ వారిని అవమానించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే డెహ్రాడూన్‌లో చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ స్టేజ్ పై పాడుతున్న సమయంలో ఓ యువకుడు చేసిన పనికి ఆమెతో సహా అందరూ షాక్ కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ భారతీయ సింగర్ సునిధి చౌహన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇప్పటి వరకు భారతీయ భాషలలో ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు. ఆమె కెరీర్ లో మూడు ఫిలిమ్ ఫేర్ అవార్డు దక్కాయి. అలాంటి సింగర్ కి ఘోర అవమానం జరిగింది. డెహ్రాడూన్ లోని ఎస్జీఆర్ఆర్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజ్ పై పాట పడేందుకు సిద్దమవుతుంది. అంతలోనే ఓ యువకుడు ఆకతాయి చర్యలకు పాల్పపడటంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. స్టేజ్ పై సునిధి చౌహన్ పాట పాడేందుకు గొంతు సవరించుకుంటుంది. అంతలోనే ఓ యువకుడు వాటర్ బాటిల్ ఆమెపై విసిరాడు. ఆ బాటిల్ ఆమె పక్కన పడింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో సునిధి చౌహన్ ఒక్కసారే షాక్ అయ్యింది.

ఈ వీడియోని రిషబ్ భండారీ అండ్ ఉత్తరాఖండి ఆఫిషియల్స్ ఇన్ స్ట్రా పేజీలో పోస్ట్ చేశారు. వేదికపై పాడుతున్న సమయంలో బాటిల్ వచ్చి పడటం చూసి సునధికి చౌహన్ ఎంతో అసహనానికి గురైంది. ఏం జరుగుతుంది..? బాటిల్ విసిరితే జరిగేది ఏంటీ? నన్ను ఇలా అవమానిస్తే.. ఈ షో ఆగిపోతుంది. అదే కదా మీకు కావాల్సింది? ని ఆ కుర్రాడికి కౌంటర్ ఇచ్చింది. దీతో అక్కడ ఉన్న ప్రేక్షకులు నో.. నో అంటూ అరిచారు. ప్రతిచోట ఇలాంటి అకతాయిలు ఉంటూనే ఉంటారు.. జరిగే ప్రోగ్రామ్ ని ఆపేయొద్దు అంటూ కామెంట్స్ చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది నెటిజన్లు అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by 𝐑𝐢𝐬𝐡𝐚𝐛𝐡 𝐁𝐡𝐚𝐧𝐝𝐚𝐫𝐢 | Dehradun (@rishabhuncutnews)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి