iDreamPost

రైతులకు కేంద్రం అలర్ట్.. ట్రాక్టర్ కొంటే 50 శాతం సబ్సిడీ.. ప్రభుత్వం కీలక ప్రకటన

రైతన్నలకు బిగ్ అలర్ట్. ట్రాక్టర్ కొంటే 50 శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని కొత్త ట్రాక్టర్ కొనేందకు సిద్ధమవుతున్నారా? దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అదేంటంటే?

రైతన్నలకు బిగ్ అలర్ట్. ట్రాక్టర్ కొంటే 50 శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని కొత్త ట్రాక్టర్ కొనేందకు సిద్ధమవుతున్నారా? దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అదేంటంటే?

రైతులకు కేంద్రం అలర్ట్.. ట్రాక్టర్ కొంటే 50 శాతం సబ్సిడీ.. ప్రభుత్వం కీలక ప్రకటన

భారత దేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వివిధ రకాల పంటలు పండిస్తూ దేశ ప్రజలకు అన్నం పెడుతూ ఆకలి తీరుస్తున్నారు. ఒకప్పటితో పోల్చితే నేడు వ్యవసాయ పనుల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. దుక్కి దున్నే దగ్గర్నుంచి పంట చేతికి వచ్చే వరకు యంత్ర పరికరాలు వినియోగిస్తూ రైతులు పనులు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది కూడా వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులు ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైతులకు కేంద్రం బిగ్ అలర్ట్ ను ఇచ్చింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీం ద్వారా ట్రాక్టర్ కొంటే 50 శాతం సబ్సిడీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

రైతన్నలకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను ప్రవేశ పెడుతున్నది. పంట పెట్టుబడి సాయం, యంత్ర పరికరాలకు సబ్సిడీని కల్పిస్తూ అండగా నిలుస్తున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతులు కొత్త ట్రాక్టర్ కొంటే సంగం వరకు సబ్సిడీ ఇస్తున్నదంటూ మోసపూరిత వెబ్ సైట్లు ప్రచారం చేస్తున్నాయి. మరి మీరు ఇలాంటి వెబ్ సైట్లను నమ్మితే మోసానికిగురయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఇటువంటి వెబ్ సైట్ల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయంలో ట్రాక్టర్ వినియోగం ఎక్కువైపోయిన తరుణంలో దీన్ని అదునుగా చేసుకున్న కొందరు మోసాలకు పాల్పాడుతున్నారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

50 subsidy from Central

పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో ఉన్న ఓ వెబ్‌సైట్ ట్రాక్టర్ల కొనుగోలుపై రైతులకు కేంద్ర ప్రభుత్వం 20 శాతం నుంచి 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందని ప్రచారానికి తెరలేపింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అందించే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నది. దీన్ని నమ్మిన రైతులు చాలా మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలని ఆ వెబ్‌సైట్ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి.. అప్లై చేసుకుంటున్నారు. కానీ అది నిజం కాదు.

అది రైతుల్ని మోసం చేసే వెబ్‌సైట్. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన వెబ్‌సైట్ ఫేక్ అని స్పష్టం చేసింది. ఇలాంటి పథకం అమలు చేయట్లేదని.. రైతులు ఆ మోసపూరిత ప్రకటన చూసి మోస పోవద్దని తెలిపింది. రైతులు తమ వ్యక్తిగత వివరాల్ని ఆ మోసపూరిత వెబ్‌సైట్‌లో ఇవ్వొద్దని కోరుతోంది. ప్రభుత్వ మీడియా వెబ్‌సైట్ పిఐబిలో ఉండే ఫ్యాక్ట్‌చెక్ బృందం, ట్విట్టర్ (ఎక్స్)లో ఈ పథకంపై స్పష్టత ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి