iDreamPost

టాలీవుడ్ స్టార్స్ పై బాలీవుడ్ కెమెరామెన్ నోటి దురుసు.. వీళ్ల ఏడుపు దేని గురించి?

Bollywood Photographer On Tollywood Heros: బాలీవుడ్ నుంచి ఎవరో ఒకరు ఏదో సందర్భంలో టాలీవుడ్ హీరోలపై అక్కసు ప్రదర్శిస్తూనే ఉంటారు. తాజాగా ఒక కెమెరామెన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

Bollywood Photographer On Tollywood Heros: బాలీవుడ్ నుంచి ఎవరో ఒకరు ఏదో సందర్భంలో టాలీవుడ్ హీరోలపై అక్కసు ప్రదర్శిస్తూనే ఉంటారు. తాజాగా ఒక కెమెరామెన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

టాలీవుడ్ స్టార్స్ పై బాలీవుడ్ కెమెరామెన్ నోటి దురుసు.. వీళ్ల ఏడుపు దేని గురించి?

గతంలో అంటే ఇండియన్ సినిమా అంటే అంతా బాలీవుడ్ అనేవాళ్లు. ప్రపంచ వేదికపై కూడా బాలీవుడ్ ని ఇండియన్ సినిమాగా కొనియాడేవాళ్లు. కానీ, ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాగా మారిపోయింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ అనే పరిస్థితికి వచ్చేసింది. సాధారణంగానే కొత్తోళ్లు వస్తే బాలీవుడ్ వాళ్లు రిసీవ్ చేసుకోలేరు. అలాంటి సౌత్ వాళ్లు లేకుండా ఇప్పుడు వాళ్లు బ్లాక్ బస్టర్ అందుకునే పరిస్థితి కనిపిచడం లేదు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా వారి అక్కసును ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ లిస్టులో స్టార్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఉంటారు. ఇప్పుడు ఒక కెమెరామ్యాన్ కూడా ఆ లిస్టులోకి చేరాడు. సౌత్ హీరోలకు యాటిట్యూడ్ అంటూ నోటి దురుసు ప్రదర్శించాడు.

సింపుల్ ఫార్ములా:

సాధారణంగా సౌత్ హీరోలు.. అందులోనూ తెలుగు హీరోలు ఎంతో సింపుల్ గా ఉంటారు. అయితే అదంతా బూటకం అని.. సౌత్ హీరోలకు యాటిట్యూడ్ ఎక్కువ అంటూ బాలీవుడ్ కెమెరామెన్ వీరేందర్ చావ్లా కామెంట్ చేశాడు. నిజానికి బాలీవుడ్ తారలకు ఎంతో తల పొగరు ఉంటుంది అని ఎప్పటి నుంచో పాన్ ఇండియా లెవల్లో చాలానా వార్తలు వచ్చాయి. పైగా వారి యాటిట్యూడ్ గురించి సొంత ఇండస్ట్రీ వాళ్లే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఈ ఫొటోగ్రాఫర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. అంతేకాకుండా సౌత్ హీరోలు ఫేక్ అంటూ దురుసు వ్యాఖ్యలు చేశాడు.

విజయ్ దేవరకొండ ఒక సినిమా ఫంక్షన్ కి చెప్పులు వేసుకుని వెళ్లడాన్ని పరోక్షంగా విమర్శించాడు. ఏదో సింపుల్ గా ఉన్నారు అనిపించుకోవడానికి అలా చేస్తారు అంటూ కామెంట్ చేశాడు. నిజానికి రౌడీ హీరో ఎంత హుందాగా, డౌన్ టూ ఎర్త్ ఉంటాడో మన అందరికీ తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరపు చర్చకు తెరలేపాడు. మహేశ్ బాబు బాలీవుడ్ తనకు అవసరం లేదు అనే వ్యాఖ్యలను కూడా ప్రస్తావించాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా నోరు పారేసుకున్నాడు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే తారక్ ఇటీవల ఒక ఫొటోగ్రాఫర్ సీరియస్ అవ్వడం చూశాం.

అయితే అది జరిగినప్పుడు ఫొటో తీసింది ఒకరు అయితే.. తన టీమ్ కి చెందిన వ్యక్తిపై తారక్ సీరియస్ అయ్యాడు అంటూ కామెంట్ చేశాడు. అంటే ఇదంతా ఈ ఫొటోగ్రాఫర్ కావాలని అక్కసుతో చేసిన వ్యాఖ్యలు అని క్లియర్ గా అర్థమైపోతున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంత వినయంగా ఉంటారో మన అందరికీ తెలిసిందే. అలాగే సౌత్ హీరోలు ఎంత డౌన్ టూ ఎర్త్ ఉంటారో కూడా అందరికీ తెలుసు. కానీ, బాలీవుడ్ కి చెందిన పలువురు ఇలాంటి వ్యక్తులు మాత్రం అకారణంగా నోరు పారేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలతో వారి స్థాయిని వాళ్లే తగ్గించుకుంటారు అంటూ నెటిజన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి