iDreamPost

దొంగలు డబ్బులు, నగలు దొంగిలిస్తారు.. కానీ, ఇతనేం చోరీ చేశాడో తెలుసా?

పైన కనిపిస్తున్న ఇతగాడు ఓ దొంగ. డబ్బు, నగలు దొంగిలించారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మరి ఇంతకు ఇతడు చోరీ చేసిందేంటో తెలుసా?

పైన కనిపిస్తున్న ఇతగాడు ఓ దొంగ. డబ్బు, నగలు దొంగిలించారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మరి ఇంతకు ఇతడు చోరీ చేసిందేంటో తెలుసా?

దొంగలు డబ్బులు, నగలు దొంగిలిస్తారు.. కానీ, ఇతనేం చోరీ చేశాడో తెలుసా?

ఇతని పేరు మోహన్. తమిళనాడుకు చెందిన ఇతగాడు చాలా కాలం నుంచి బెంగుళూరులో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా మంచి నీళ్లు అమ్ముకుంటూ సంపాదిస్తున్నాడు. అలా చాలా కాలం నుంచి మోహన్ ఇదే పని చేస్తూ పైసా పైసా కూడబెట్టాడు. తన పని తాను చేసుకుంటూ సంతోషంగానే ఉన్నాడు. ఇక చేతి నిండా డబ్బులు ఉండడంతో ఇతడు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటుపడ్డాడు. కష్టపడి సంపాదించిన ప్రతీ రూపాయి ఆటలకే కేటాయించేవాడు. కొంత కాలానికి డబ్బు లేకపోవడంతో అప్పు చేసి మరీ ఆన్ లైన్ గేమ్స్ ఆడాడు. ఇక అప్పులు మరింత ఎక్కువవడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలోనే మోహన్ ఎవరూ ఊహించని దొంగతనం చేసి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకు ఇతగాడు దొంగిలించింది ఏంటో తెలుసా?

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన మోహన్ అనే యువకుడు చాలా కాలం నుంచి బెంగుళూరులోని గిరినగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా మంచి నీళ్లు అమ్ముకుంటూ ఉండేవాడు. ఇక చేతి నిండా డబ్బులు కనిపించడంతో మోహన్ రమ్మీ ఆడుతూ లక్షల్లో పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత డబ్బులు లేకపోవడంతో అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. పైగా మంచి నీళ్ల వ్యాపారం కూడా మూతపడే స్థితికి చేరుకుంది. దీంతో నీళ్లు లేకపోవడంతో వచ్చిన కస్లమర్లు తిరిగి వెనక్కి వెళ్లిపోయేవారు. ఈ క్రమంలోనే అతని మంచి నీళ్ల వ్యాపారం పూర్తిగా దివాలా తీసింది. ఇదే సమయంలో మోహన్ కు ఓ ఐడియా వచ్చింది. అదే దొంగతనం చేయడం.

నగలు, డబ్బులు దొంగిలించాడు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అవును, మీరు విన్నది నిజమే. అతడు చేసిన చోరీ చేసిందేంటో తెలిస్తే మీరు షాకవుతారు. అసలు విషయం ఏంటంటే? మోహన్ రాత్రిళ్లు అందరూ నిద్రపోయాక కారు తీసుకుని బయటకు వెళ్లేవాడు. ఆ తర్వాత తనకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో మంచినీళ్లు దొంగతనం చేసేవాడు. చోరీ చేసిన ఆ నీటిని తన కస్టమర్లకు అమ్మేవాడు. మోహన్ చాలా కాలం నుంచి ఇదే పని చేస్తూ వచ్చాడు. ఇక అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు మోహన్ అదుపులోకి తీసుకున్నారు.

ఏం జరిగిందని అతడిని విచారించిగా.. నేను మంచి నీళ్ల వ్యాపారం చేస్తాను. వచ్చిన డబ్బును అంతా రమ్మీ ఆడి పోగొట్టుకున్నాను. దీంతో కస్లమర్లకు మంచి నీళ్లను అందించడంలో విఫలమయ్యాను. ఈ క్రమంలోనే మంచి నీటిని చోరీ చేసి నా కస్టమర్లకు అమ్ముతున్నానని మోహన్ చెప్పాడు. అతడి మాటలు విని పోలీసులు షాక్ కు గురయ్యారు. ఇదేం దొంగతనం రా బాబు అంటూ ఓ సారి నవ్వుకున్నారు కూడా. ఆ తర్వాత పోలీసులు నిందితుడు మోహన్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రాత్రిళ్లు మంచి నీళ్ల దొంగతనం చేసిన మోహన్ చోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి