iDreamPost

వీరయ్య వీరసింహా కలెక్షన్ రిపోర్ట్

ముఖ్యంగా విజేతగా నిలిచిన చిరంజీవి ఊచకోత మాములుగా లేదు. మొదటివారం కాకుండా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వెళ్లడం ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది. జనవరి 13 నుంచి నిన్నటి దాకా వీరయ్య కలెక్ట్ చేసిన షేర్ అక్షరాలా 83 కోట్లు.

ముఖ్యంగా విజేతగా నిలిచిన చిరంజీవి ఊచకోత మాములుగా లేదు. మొదటివారం కాకుండా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వెళ్లడం ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది. జనవరి 13 నుంచి నిన్నటి దాకా వీరయ్య కలెక్ట్ చేసిన షేర్ అక్షరాలా 83 కోట్లు.

వీరయ్య వీరసింహా కలెక్షన్ రిపోర్ట్

సంక్రాంతి పండగ సెలవులు అయిపోయాయి. ఈ సీజన్ ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు ఈ అయిదారు రోజులను పూర్తిగా వాడేసుకున్నాయి. ముఖ్యంగా విజేతగా నిలిచిన చిరంజీవి ఊచకోత మాములుగా లేదు. మొదటివారం కాకుండా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వెళ్లడం ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది. జనవరి 13 నుంచి నిన్నటి దాకా వీరయ్య కలెక్ట్ చేసిన షేర్ అక్షరాలా 83 కోట్లు. అంటే గ్రాస్ 144 కోట్ల దాకా తేలుతుంది. అత్యధికంగా నైజామ్ నుంచి 22 కోట్లకు పైగా రాబట్టగా సీడెడ్ నుంచి 13 కోట్లు తెచ్చుకోవడం విశేషం. ఓవర్సీస్ లో టూ మిలియన్ కు అతి దగ్గరగా ఉన్న వీరయ్య 10 కోట్ల మార్కుని సగర్వంగా దాటేశాడు.

ఇదింకా మొదటి వారమే కాబట్టి ఫైనల్ రన్ అయ్యేలోపు డబుల్ బ్లాక్ బస్టర్ నమోదు కావడం ఖాయమే. థియేట్రికల్ బిజినెస్ 89 కోట్లే కావడంతో ఇంకో ఆరు కోట్లు వస్తే చాలు బ్రేక్ ఈవెన్ దాటేయొచ్చు. ఇది చాలా తేలిక. టికెట్ రేట్లు ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. పదో రోజు తర్వాత సాధారణ స్థితికి వస్తాయి. అప్పుడు మరింత మెరుగుదల చూడొచ్చు. ఇక వీరసింహారెడ్డి విషయానికి వస్తే ఒక రోజు ముందు రిలీజైన అడ్వాంటేజ్ ని వాడుకోవడంతో ఆరు రోజలకుగాను 65 కోట్ల షేర్ నమోదు చేసింది. గ్రాస్ రూపంలో 109 కోట్లు. టాక్ రివ్యూస్ ఎలా వచ్చినప్పటికీ పండగ బెనిఫిట్ తో పాటు వాల్తేరు వీరయ్య ఓవర్ ఫ్లోస్ ప్లస్ అయ్యాయని ట్రేడ్ రిపోర్ట్

మొత్తానికి ఇద్దరు సీనియర్లు తమ సత్తాని గట్టిగానే చాటినప్పటికీ చిరంజీవిదే పైచేయి అయ్యింది. వారసుడు సైతం ఊహించిన దానికన్నా మెరుగ్గా ఎనిమిది కోట్లకు పైగా షేర్ తెచ్చుకోగా ఒక రోజు బిగ్గెస్ట్ రిలీజ్ దక్కినా తెగింపు దాన్ని వాడుకోలేకపోయింది. కళ్యాణం కమనీయం మొదటి షో నుంచే నెగటివ్ షేర్ వచ్చేయడంతో కనీసం దాని లెక్కలు కూడా ట్రేడ్ దగ్గర లేవు. కోరిమరీ పోటీకి వచ్చి డిజాస్టర్ చేసుకున్నట్టు అయ్యింది. ఇంకో వారం పది రోజుల దాకా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం వీరయ్య వీరసింహాలకు బాగా కలిసి వచ్చేలా ఉంది. రిస్క్ చేసి మరీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసిన మైత్రి సంస్థకు గొప్ప ఫలితమే దక్కేలా ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి