iDreamPost

OTTలోకి వచ్చేసిన అవంతిక వందనపు కొత్త చిత్రం.. మీన్ గార్ల్స్ కి మించే..

Avantika Vandanapu New Movie: అవంతిక వందనపు మీన్ గర్ల్స్ సినిమాని ఇండియాలో బాగా మిస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె కొత్త వెబ్ సిరీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Avantika Vandanapu New Movie: అవంతిక వందనపు మీన్ గర్ల్స్ సినిమాని ఇండియాలో బాగా మిస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె కొత్త వెబ్ సిరీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

OTTలోకి వచ్చేసిన అవంతిక వందనపు కొత్త చిత్రం.. మీన్ గార్ల్స్ కి మించే..

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన అవంతిక వందనపు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్నప్పుడు టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. అలాగే కొన్ని కమర్షియల్స్ లో కూడా అవంతిక తళ్లుక్కుమంది. కానీ, సడెన్ ఆమె వెండితెరకు దూరమైంది. అందరూ అవంతిక చదువు మీద దృష్టి పెట్టి ఉంటుంది అనుకున్నారు. అయితే ఆమె హాలీవుడ్ మీద కన్నేసింది. అక్కడే తన కెరీర్ ను సుస్థిరం చేసుకుంది. ఇటీవల అవంతిక ప్రధాన పాత్రలో నటించిన మీన్ గార్ల్స్ అనే మూవీకి వరల్డ్ వైడ్ గా ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీ ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. అయితే ఆ మూవీ అమెరికాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు వచ్చిన వెబ్ సిరీస్ మాత్రం ఇండియాలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ వెబ్ సిరీస్ పేరు బిగ్ గర్ల్స్ డోంట్ క్రై. ఇది మార్చి 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాల నుంచి గంట వరకు ఉంటుంది. ఈ బిగ్ గరల్స్ డోంట్ క్రై వెబ్ సిరీస్ ని.. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. నిత్యా మెహ్రా, కరణ్ కపాడియా, కోపల్ నైతాని, సుధాన్షు సరియా డైరెక్షన్ చేశారు. రిలీజ్ అయిన గంటల్లోనే ఈ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై సిరీస్ కి మంచి అప్లాజ్ లభిస్తోంది. అమెజాన్ ఆడియన్స్ కు ఈ సిరీస్ బాగా నచ్చేస్తోంది.

Avantika new movie in OTT

మీన్ గర్ల్స్ సినిమా వరల్డ్ వైడ్ గా వైరల్ అయిన తర్వతా అంతా అవంతికి సినిమా ఎప్పడు వస్తుంది అని ఎదురుచూపులు ప్రారంభించారు. అయితే ఆ మూవీ కేవలం అమెరికాలోనే రిలీజ్ కావడంతో అందరూ నిరుత్సాహ పడ్డారు. కానీ, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో వారిక కోరిక తీరినట్లు అయ్యింది. పైగా ఈ వెబ్ సిరీస్ కూడా దాదాపుగా మీన్ గర్ల్స్ తరహాలోనే ఉంటుంది. కొందరు విద్యార్థులు వందనా వ్యాలీ పాఠశాలకు వెళ్తారు. అక్కడ కొత్త, పాత స్టూడెంట్స్ కలిసి ఒక గ్యాంగ్ అవుతారు. వాళ్లు పాఠశాలలో ఎదుర్కొనే పరిస్థితులు, వాళ్లలో వాళ్లు పడో గొడవలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అలాగే కథను ముందకు తీసుకెళ్తాయి. వీరి కుటుంబ నేపథ్యాలు భిన్నంగా ఉంటాయి.

ఒక్కొక్కరు కుంటుబాన్ని వదిలి రాలేక.. వస్తేనే బాగుంది అనుకునే వాళ్లు కొందరు ఉంటారు. ఈ స్కూల్లో సాధారణంగా అంతా డబ్బున్న వాళ్లే చేరతారు. అలాంటి స్కూల్ కి కావ్య అనే ఒక అమ్మాయి స్కాలర్ షిప్ మీద చేరుతుంది. ఈ సిరీస్ మొత్తం ఇంటర్ చదువుకునే టీనేజ్ పిల్లల మనస్తత్వం మీదే ఉంటుంది. వారి ఆలోచనలు, ఆ వయసులో కలిగే ఆకర్షణ, ప్రేమ, గోల్స్, ఆకతాయి పనులు ఇలా ప్రతి అంశాన్ని ఈ సిరీస్ లో టచ్ చేశారు. మొత్తానికి ఇది ఒక అద్భుతమైన సిరీస్ గా తెరకెక్కించారు. ఇందులో ప్రతి అమ్మాయి యాక్టింగ్ ఇరగదీసేస్తుంది. ఎవరికి వాళ్లు అదరగొట్టేసారు. ముఖ్యంగా అవంతిక పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. మరి.. అమెజాన్ ప్రైమ్ లో ఉన్న బిగ్ గర్ల్స్ డోం క్రై వెబ్ సిరీస్ ని చూస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి