iDreamPost

సుందరానికి కత్తెర కావాలి

సుందరానికి కత్తెర కావాలి

నిన్న విడుదలైన అంటే సుందరానికి డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ భీభత్సంగా రాలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాని మార్కెట్ కు తగ్గట్టే ఉన్నాయి. కాకపోతే చాలా చోట్ల ఎంసిఏని ఫస్ట్ డే దాటలేకపోవడం మైనస్సే. ఓవర్సీస్ లోనూ ప్రీమియర్ కలెక్షన్ మేజర్ కన్నా తక్కువే ఉంది. ఈ నేపథ్యంలో సుందరానికి మౌత్ టాక్ చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇచ్చే రివ్యూలు రాబోయే రెండు మూడు రోజులను ప్రభావితం చేయబోతున్నాయి. బాగానే ఉందంటూనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళ సంఖ్య పెద్దగానే ఉంది. అందులో ప్రధానంగా ఇస్తున్న కంప్లయింట్ మూడు గంటలకు జస్ట్ ఎనిమిది నిముషాలు తక్కువున్న నిడివి.

ఇలాంటి ఎంటర్ టైనర్ కు అంత లెన్త్ అవసరం లేదు. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ కంటెంట్ మీద నమ్మకంతో ట్రిమ్ చేయకుండా అలాగే వదిలేశారు. కట్ చేస్తే ఇప్పుడు దాని మీదనే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. కనీస ఇరవై నుంచి ముప్పై నిమిషాల మధ్యలో కొంత భాగం తొలగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధిక శాతం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. సరదాగా నవ్వించే ప్రేమకథ అయినప్పుడు చిన్నప్పటి ఎపిసోడ్ అంతసేపు ఎందుకన్న కామెంట్లు సీరియస్ గా తీసుకోవాలి. చైల్డ్ నానిగా నటించిన శేఖర్ మాస్టర్ కొడుకు నిమ్మిని ప్రొజెక్ట్ చేయాలనే తాపత్రయంతో అంత ల్యాగ్ ఇచ్చారానే సందేహాలు లేకపోలేదు. వీటిని అర్జెంట్ గా సరిచేయాలి.

ఈ లెక్కన సుందరానికి కత్తెర అవసరం తప్పేలా లేదు.నాని సైతం తగ్గిస్తే మంచిదనే సలహా ఇచ్చినట్టు వినికిడి. ఏది చేసినా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. తర్వాత చూద్దాంలే అనుకుంటే జనం లైట్ తీసుకుంటారు. అసలే మేజర్, విక్రమ్ లు బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉన్నాయి.వీటిని దాటేలా పెర్ఫార్మ్ చేయాలంటే అంటే సుందరం సూపర్ హిట్ అనిపించుకోవాలి. నిన్న నైజామ్ లో కోటిన్నర షేర్ వచ్చిందన్న ట్రేడ్ రిపోర్ట్ నిజమైతే ప్రమోషన్ కూడా వేగం పెంచాలి. గత రెండు వారాలుగా నజ్రియా సహా టీమ్ మొత్తం అదే పనిలో ఉంది కానీ ఆ కత్తెర సంగతేదో చూసి డెసిషన్ తీసుకుంటే ఫలితం ఇంకా మెరుగ్గా మారే ఛాన్స్ అయితే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి