iDreamPost
android-app
ios-app

9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!

  • Author singhj Published - 09:44 PM, Thu - 21 September 23
  • Author singhj Published - 09:44 PM, Thu - 21 September 23
9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!

ప్రముఖ నటి అనసూయ గురించి అందరికీ తెలిసిందే. యాంకర్​గా కెరీర్​ను ఆరంభించిన ఆమె గ్లామర్​ క్వీన్​గా పేరు సంపాదించారు. బుల్లితెరపై హుషారైన యాంకరింగ్, అదిరిపోయే అందంతో క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో వెండితెర దిశగా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. ఈ క్రమంలో నటించిన ‘రంగస్థలం’, ‘పుష్ప’తో టాలీవుడ్​లో అనసూయ తన ప్లేస్​ను ఫిక్స్ చేసుకున్నారు. ముఖ్యంగా ‘రంగస్థలం’లో రంగమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం, పలికించిన హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వరుసగా సినిమాలు చేస్తూ పోతున్న అనసూయకు ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తనకు వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియాలో ఫ్యాన్స్​తో టచ్​లో ఉంటారు అనసూయ. తన వ్యక్తిగత విషయాలను కూడా ఆమె ఓపెన్​గానే షేర్ చేసుకుంటారు. తన భర్త భరద్వాజ్ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు అనసూయ. పెళ్లికి ముందు అనసూయ-భరద్వాజ్​లు ప్రేమించుకున్న విషయం తెలిసిందే. తొమ్మిదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. 2010లో మ్యారేజ్ చేసుకున్నారు. తొలుత వీరి వివాహానికి కుటుంబ సభ్యులు నో చెప్పినప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరూ పట్టుబట్టి మరీ ఒప్పించారట.

అనసూయ-భరద్వాజ్ జంటకు ఇద్దరు కొడుకులు. తాజాగా తన భర్త గురించి అనసూయ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ‘కులమతాలను నేను అంతగా పట్టించుకోను. మేం 9 ఏళ్లు ప్రేమలో ఉన్నప్పటికీ.. భరద్వాజ్ కులమేంటో నాకు తెలీదు. లగ్నపత్రిక రాసేముందు గోత్రం, కులం అడిగారు. అప్పుడు ఆయన ఫలానా కులానికి చెందిన వ్యక్తి అని నాకు తెలిసింది. మేం ఇద్దరం కులమతాలను పట్టించుకోం’ అని అనసూయ చెప్పుకొచ్చారు. ‘పెద్ద కాపు-1’ చిత్రం ప్రమోషన్స్​లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ మూవీతోనే తెలుగు చిత్రాలకు పోటీ!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetboo girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis