iDreamPost

బన్నీ గ్రేట్… రూ. 10 కోట్లు ఇస్తానన్న ఆ ప్రకటన చేయనన్న అల్లు అర్జున్

Allu Arjun No to That Add.. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. అతడికి విపరీతంగా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ను వినియోగించుకోవాలనుకుంది ప్రముఖ యాడ్ కంపెనీ.. కానీ

Allu Arjun No to That Add.. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. అతడికి విపరీతంగా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ను వినియోగించుకోవాలనుకుంది ప్రముఖ యాడ్ కంపెనీ.. కానీ

బన్నీ గ్రేట్… రూ. 10 కోట్లు ఇస్తానన్న ఆ ప్రకటన చేయనన్న అల్లు అర్జున్

అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్.. ఒక్కో స్టెప్ ఎక్కుతూ.. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా అవతరించాడు. పుష్పతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. ఏ తెలుగు హీరోకు దక్కని జాతీయ ఉత్తమ పురస్కారాన్ని పొందాడు. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మ రూపంలో కొలువు దీరాడు బన్నీ. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా నిలిచాడు. కాగా, ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండే నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. హుందాగా వ్యవహరించి అభిమానుల మనస్సు దోచుకున్నాడు ఈ గ్లోబల్ స్టార్. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌తో అతడి వద్దకు ఓ యాడ్ చేయమని రాగా, సున్నితంగా తిరస్కరించాడట ఈ అల్లువారబ్బాయి.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీలో పుష్ప రాజ్ పాత్రలో అలరించాడు ఐకాన్ స్టార్. ఈ సినిమా టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు అటు మాలీవుడ్, బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసేసింది. అందులో పాటలకు కానీ, బన్నీ డైలాగ్స్‌కు గానీ .. ఫిదా అయిపోయారు ఆడియన్స్. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరి నోటి నుండి ఆ మూవీ పాటలు, డైలాగులు తూటాల్లా పేలాయి. అల్లు అర్జున్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ సమయంలో పొగాకు ఉత్పత్తులకు సంబంధించి ప్రకటన చేయమని ఓ ఆఫర్ వచ్చింది. తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండాలని.. అందుకు రెమ్యునరేషన్ కింద రూ. 10 కోట్ల వరకు ఇస్తామని ఆఫర్ చేయగా.. మొహమాటం లేకుండా తిరస్కరించాడట అల్లు అర్జున్.

పుష్పరాజ్‌ ధూమపానం చేసే ప్రతి సీన్‌లోనూ బ్యాగ్రౌండ్‌లో తమ బ్రాండ్‌ లోగో కనిపించేలా చూడాలని కోరిందట. అందుకు కూడా బన్నీ నో చెప్పారట. అన్ని కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినా కూడా.. మరో ఆలోచన చేయకుండా ఆ యాడ్ చేయనని చెప్పేశాడట. ఆరోగ్యానికి హాని కలిగించి.. అభిమానులకు ఇష్టం లేని పనులు తాను చేయలేనంటూ సున్నితంగా తిరస్కరించాట. వరల్డ్‌ టుబాకో డే సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. దీంతో అల్లు అర్జున్ గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి