విజయ్ దేవరకొండతో ‘‘ఫ్యామిలీమ్యాన్’’, నానితో ‘‘ నాన్న’’ అనే సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో త్వరలో విడుదల కానున్నాయి.
venkateswarlu
venkateswarlu
‘‘ సీతారామం’’ సినిమాతో తెలుగు నాట పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోవటమేకాదు.. కుర్రకారు గుండెలో సీతగా మిగిలిపోయారు. సీతారామం సినిమా సాధించిన విజయంతో తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్నారామె. విజయ్ దేవరకొండతో ‘‘ఫ్యామిలీమ్యాన్’’, నానితో ‘‘ నాన్న’’ అనే సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో త్వరలో విడుదల కానున్నాయి. అయితే, తెలుగుతో పాటు హిందీ భాషల్లో తీరికలేకుండా సినిమాలు చేస్తున్న మృణాల్ పెళ్లిపై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో అన్నట్లుగా మాట్లాడారు. సైమా అవార్డుల సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సైమా అవార్డుల వేదికపై ఉన్న అల్లు అరవింద్.. మృణాల్ ఠాకూర్ ఉద్ధేశించి మాట్లాడుతూ.. ‘‘నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓ మంచి హైదరాబాద్ అబ్బాయిని చూసుకోవాలి( పెళ్లి అన్న ఉద్దేశం వచ్చేలా అన్నారు). హైదరాబాద్‌కు వచ్చేయాలి. నేను నిన్ను దీవిస్తున్నాను’’ అని అన్నారు. మృణాల్‌తో పాటు అక్కడున్న వాళ్లు మొత్త నవ్వారు.
ఇక, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆల్లు అరవింద్ కామెంట్లను సీరియస్‌గా తీసుకుంటున్నారు. త్వరలో మృణాల్ కూడా తెలుగింటి కోడలు కాబోతోందంని అంటున్నారు. ఎందుకంటే.. గతంలో ఆయన లావణ్య త్రిపాఠిని తెలుగుబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో అన్నారు. ఆమె వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకోబోతోంది. అతి త్వరలో వీరి పెళ్లి జరగనుంది. మరి, మృణాల్ పెళ్లిపై అల్లు అరవింద్ చేసిన ఇంట్రస్టింగ్ కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#alluaravind mawa very naughty aa… #MrunalThakur tfi lo young heroni chesesko… pic.twitter.com/kjeCzguXQM
— celluloidpanda (@celluloidpanda) October 28, 2023