iDreamPost

బిగ్ బ్రేకింగ్: ప్రముఖ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య!

PJayaram Accident- Serieal Artist Chandu Takes Life: త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్రా జయరాం భర్తగా ప్రచారం జరుగుతున్న సీరియల్ ఆర్టిస్ట్ చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవిత్ర ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజుల్లో అతను ఇలా ప్రాణాలు తీసుకున్నాడు.

PJayaram Accident- Serieal Artist Chandu Takes Life: త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్రా జయరాం భర్తగా ప్రచారం జరుగుతున్న సీరియల్ ఆర్టిస్ట్ చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవిత్ర ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజుల్లో అతను ఇలా ప్రాణాలు తీసుకున్నాడు.

బిగ్ బ్రేకింగ్: ప్రముఖ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య!

బుల్లితెర సీరియల్ నటి, త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం ఇటీవల ఆక్సిడెంట్ లో ప్రాణాలో కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఘటనను మరువక ముందే ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న మరో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పవిత్ర జయరాం పుట్టిన రోజు సందర్భంగా అతను ఇలా ప్రాణాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. నా పవిత్ర పిలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ఆత్మహత్య చేసుకున్నాడు అని భావిస్తున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఈ ఘటన జరిగింది.

ఇటీవల త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం కారు ప్రమాదంలో మరిణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సహ నటుడు చందు ఎంతో ఎమోషనల్ అవ్వడం చూశాం. పలు ఇంటర్వ్యూలలో తన బాధను వ్యక్త పరిచాడు. పవిత్ర మరణించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. పవిత్ర బదులు తన ప్రాణాలు పోయినా బాగుండు అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పుడు అతను ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలియగానే బుల్లితెర నటులు, అభిమానులు అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా తన సోషల్ మీడియాలో ఖాతాలో పవిత్రకు సంబంధించి పోస్టు పెట్టినట్లు చెబుతున్నారు. ఈ రోజు నా పవిత్ర పుట్టినరోజు ఆమె నన్ను పిలుస్తోంది అని పోస్ట్ చేశాడు. ఆ తర్వాతే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకే చందు ఇలా ప్రాణాలు తీసుకున్నాడు అని బావిస్తున్నారు. ఆరేళ్లుగా నటి పవిత్రా జయరాంతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. 2015లో చందుకు శిల్ప అనే యువతితో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. పవిత్రకు దగ్గరైన తర్వాత భార్యకు దూరమయ్యాడని తెలుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉన్నట్లు చందు వెల్లడించాడు. తాను ఎక్కువ రోజులు బతకనేమో అంటూ వ్యాఖ్యలు చేశాడు.

అలా కొద్దిరోజుల్లోనే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ తో చందు ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతానికి చందూది ఆత్మహత్య అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అసలు నిజం ఏంటి అనేది మాత్రం పోలీసుల విచారణలో తేలుతుంది. ఆత్మహత్య అయితే అందుకు గల కారణాలు ఏంటి అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. పవిత్ర మృతి విషయానికి వస్తే.. ఇటీవల బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా.. మహబూబ్ నగర్ సమీపంలో పవిత్ర- చందు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పవిత్ర ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుంచి చందు కాస్త డిప్రెషన్ లో ఉన్నట్లుగా కనిపించాడు. పలు ఇంటర్వ్యూలలో కూడా చందూ అంలాంటి వ్యాఖ్యలే చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి