iDreamPost

రజినీకాంత్ చేతిలోని ఈ చిన్నారి.. పెద్దయ్యాక ఆయన పక్కనే హీరోయిన్ గా చేసింది!

  • Published Jun 18, 2024 | 8:06 PMUpdated Jun 18, 2024 | 8:06 PM

Pic Talk: పై ఫోటోలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. మె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈమె రజనీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా.. ఆయన సరసన హీరోయిన్ గా కూడా నటించింది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫోటోలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. మె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈమె రజనీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా.. ఆయన సరసన హీరోయిన్ గా కూడా నటించింది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 18, 2024 | 8:06 PMUpdated Jun 18, 2024 | 8:06 PM
రజినీకాంత్ చేతిలోని ఈ చిన్నారి.. పెద్దయ్యాక ఆయన పక్కనే హీరోయిన్ గా చేసింది!

వెండితెరపై వెలిగే.. నటి, నటుల్లో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే వారిలో కొంతమంది మొదట చైల్డ్ ఆర్టిస్ట్ లగానే తమ కెరీర్ ను మొదలుపెడుతుంటారు. ఈ క్రమంలోనే ఆగ్ర హీరోల సినిమాల్లో బాల నటులుగా ఛాన్స్ ను దక్కించుకొని.. అతి చిన్న వయసులోనే తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో అలరించి మంచి ఫేమ్ ను సంపాదించుకున్న వారు అక్కడికి కొన్నాళ్లకు హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంటారు. అయితే ఇలా నటులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది మాత్రమే క్లిక్ అయ్యి వరుస ఆఫర్లు అందుకుంటారు.

ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ ల స్థాయి నుంచి స్టార్ నటులుగా ఎదిగిన వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ హీరోయిన్ కూడా ఒకరు. పై ఫోటోలో రజనీకాంత్ తో ఉన్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈమె రజనీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా.. ఆయన సరసన హీరోయిన్ గా కూడా నటించింది. అంతేకాకుండా.. ఇప్పటికి తరగని అందంతో అభిమానులను,ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కనిపిస్తున్న ఈ చిన్నారి ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో ఆయన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇంతకి ఈ ఫోటోలో ఉన్నా ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. అందాల తార.. ‘మీనా’.  ఈమె ఒకప్పుడు టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్లలో ఒకరు. అంతేకాకుండా.. మీనా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం వంటి భాషాల్లో దాదాపు స్టార్ హీరోల అందరీ సరసన నటించింది. ఇకపోతే  మీనా మొదటిగా  రజినీకాంత్, కమలహాసన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా ఎక్కువగా నటించింది.

అయితే మీనా సినిమాల విషయానికొస్తే.. ఈమె తెలుగు, తమిళ్ చిత్ర రంగాల్లో 1991 నుంచి  2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా మెరిసింది. ఈ క్రమంలోనే తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే కెరీర్ మంచి ఫీక్స్ టైం లో ఉన్నప్పుడు ఈమె 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం అయ్యింది. కానీ, 2022లో అనారోగ్యంతో మరణించారు. ఇక సోషల్ మీడియాలో మీనా చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. మరి, ప్రస్తుతం రజనీకాంత్ తో ఉన్నా మీనా చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి