iDreamPost

వీడియో: బిగ్ బాస్ కొత్త హౌస్ మాములుగా లేదు.. ఇంద్రభవనం కూడా సరిపోదు!

Bigg Boss: బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ షోకు సంబంధించిన ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. బిగ్ బాస్ కొత్త హౌస్ గురించి ఆ వీడియోలు కనిపిస్తుంది.

Bigg Boss: బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ షోకు సంబంధించిన ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. బిగ్ బాస్ కొత్త హౌస్ గురించి ఆ వీడియోలు కనిపిస్తుంది.

వీడియో: బిగ్ బాస్ కొత్త హౌస్ మాములుగా లేదు.. ఇంద్రభవనం కూడా సరిపోదు!

బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో షోలు ఎంటర్ టైన్ చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో బిగ్ బాస్ షో ఒకటి. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ రియాల్టీ షో ప్రసారమవుతుంది. ఇప్పటికే పలు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. త్వరలో మరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే… బిగ్  బాస్ షో ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. వారి కోసం మేకర్స్ బిగ్ బాస్ ఓటీటీని కూడా ప్రారంభించారు. తాజాగా హిందీకి సంబంధించిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కొత్త హౌస్ కి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిందీలో ఇప్పటికే బిగ్ బాస్ 17 సీజన్ పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో ఓటీలో కూడా ఈ షోను ప్రారభించారు మేకర్స్. బిగ్ బస్ ఓటీటీ సీజన్ 3 ప్రసారం కానుదిం. ఈనేపథ్యంలో మేకర్స్ గురువారం సోషల్ మీడియాలో కొత్త హౌస్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక వీడియో చూసినట్లు అయితే.. కొత్త బిగ్ బాస్ హౌస్ చాలా భిన్నంగా ఉంది. ప్రతి ప్రాంతాన్ని   మేకర్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక వీడియో భారీ స్విమ్మింగ్ పూల్ ఉన్న గార్డెన్ గ్లింప్స్ తో ప్రారంభమవుతుంది. అలానే జిమ్ ప్రాంతం, ఎరుపు, బంగారంతో చేసిన లివింగ్ రూమ్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. వంటగదికి, బెడ్‌రూమ్ నిండుగా చురుకైన పరుపులతో ఉంది.

ఇక వీడియోను షేర్ చేసిన మేకర్స్ ఇల్లు అలంకరించబడింది. మీరు సిద్ధంగా ఉన్నారా అనే క్యాప్షన్ ని జోడించారు.  శుక్రవారం నుంచి బిగ్ బాస్ OTT 3..ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమా ప్రీమియంలో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. ఈ ప్రసారానికి కొన్ని గంటల ముందు టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో మేకర్స్ పంచుకున్నారు. అలానే వేదికపై హోస్ట్ గా అనిల్ కపూర్ డ్యాన్స్ చేశారు. ఇక హిందీ బిగ్ బాస్ OTT హిందీ మొదటి సీజన్‌ని ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఈ సీజన్‌లో దివ్య అగర్వాల్ విజేతగా నిలిచింది. రెండవ ఎడిషన్‌ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయగా, ఎల్విష్ యాదవ్ ఆ సీజన్‌ను గెలుచుకున్నాడు. బిగ్ బాస్ OTT 3 టీవీ రియాలిటీ షోకి హోస్ట్‌గా అనిల్ కపూర్ అరంగేట్రం చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి