iDreamPost

గుడ్‌న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం! వారందరికి ఇళ్లు..

ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి.. కీలక విషయాలను వెల్లడించారు. ప్రజలకు శుభవార్త కూడా చెప్పారు.

ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి.. కీలక విషయాలను వెల్లడించారు. ప్రజలకు శుభవార్త కూడా చెప్పారు.

గుడ్‌న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం! వారందరికి ఇళ్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాక ఇళ్లులేని వారికి సొంతింటి కలను కూడా ఏపీ ప్రభుత్వం నిరవేరుస్తుంది. ఇప్పటికే ఎంతో మంది లబ్ధిదారులకు వేలాది ఇళ్లను  ప్రభుత్వం అందజేసింది. జగనన్న కాలనీ ద్వారా ఎంతో మంది పేద వారు తమ సొంతింటి కలను సాకారం చేసుకున్నారు.  ఇంకా మరిన్ని ఇళ్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో తరచూ అధికారులతో సీఎం, మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా టిడ్కొ ఇళ్లకు సంబంధించిన అంశం, ఇతర విషయాలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు.

మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో 68 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నామని ప్రకటించారు. 1.50 లక్షల ఇళ్లను డిసెంబర్ చివరి నాటికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు0. డిసెంబర్ నాటికి 68 వేల ఇళ్లను వేగంగా పూర్తి చేసేలా  చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించే చోట రోడ్లు డ్రైనేజీ, తాగునీటి వసతి, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలను సైతం అధికారులు జారీ చేశారు.

లబ్దిదారులకు అప్పగించే చోట రహదారులు, మురుగు కాల్వలు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద పురపాలక సంఘాల్లోనూ పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. టెండర్ల ప్రక్రియ, ఇతరఅంశాలపై దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇప్పటి వరకు 81 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామని మంత్రి వెల్లడించారు. అలానే  68 వేల ఇళ్లలో 24వేల ఇళ్లు పూర్తయినట్లు, మిగిలినవి అతి త్వరలో  పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. డిసెంబర్ నాటికి 68 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

మరోవైపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతేకాక ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లును ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఇలా సీఎం జగన్ పేదల ప్రజల మదిలో మంచి గుర్తింపు పొందారు. తాజాగా టిడ్కొ ఇళ్ల పంపిణీ చేయనున్నడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్త చేస్తున్నారు. మరి. సమీక్ష సమావేశంలో మంత్రి సురేష్ వెల్లడించిన కీలక అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి