iDreamPost

బాలకృష్ణను టార్గెట్ చేసిన అధికార పార్టీ!  రంగంలోకి ఆ నేత..

బాలకృష్ణను టార్గెట్ చేసిన అధికార పార్టీ!  రంగంలోకి ఆ నేత..

2019లో ఏపీలో  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సృష్టించిన ప్రభజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి టీడీపీ కంచుకోటలు కూలిపోయాయి. అంతేకాక ఈ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమతిమైంది. అయితే  ఆ ఎన్నికల్లో ఫ్యాన్ హవాను తట్టుకుని కొందరు మాత్రమే నిలబడ్డారు. ముఖ్యంగా రాయలసీమ నుంచి ముగ్గురు నేతలు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. వారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవులు గెలిచారు. రాబోయే ఎన్నికల్లో కుప్పను ఓడించాలని టార్గెట్ చేసిన వైసీపీ.. స్థానిక ఎన్నికల ద్వారా సగం సక్సెస్ అయ్యారు. ఈక్రమంలో తాజాగా హిందూపురం పై కూడా అధికార పార్టీ టార్గెట్ పెట్టింది.

ఆపరేషన్ హిందూపురం.. రాబోయే ఎన్నికల్లో బాలకృష్ణను అధికార పార్టీ  వేసిన స్కేచ్  ఇది. ఇప్పటికే కుప్పంపై గురిపెట్టిన వైసీపీ తాజాగా బాలకృష్ణను టార్గెట్ చేసింది. అందుకు తగినట్లే స్పీడ్ పెంచిన ఫ్యాన్ పార్టీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో బావ బామర్ధులను ఎలాగైన ఇంటికి పంపించాలానే  టార్గెట్ తో వైసీపీ ఉంది. కుప్పంలో టీడీపీని బలహీన పర్చడంలో సక్సెస్ అయిన మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డినే.. హిందూపురం బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురంలో ఈసారి ఎలాగైన గెలవాలనే ఆలోచనతో వైసీపీ ఉంది.

హిందూపురంపై ఫోకస్ పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..రాగానే అక్కడి చాలామంది నేతలను కాదని దీపికాకు బాధ్యతులు అప్పగించారు. గతంలో వైసీపీ ఇన్ ఛార్జీగా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్.. అందరిని కలుపుకోని పోరనే అసంతృప్తి ఉండేది.  సమన్వయ లోపంతో మొదట్లో వైసీపీ కాస్త వెనుకబడింది. ఇప్పుడు కొత్త ఇన్ ఛార్జీ దీపిక అసంతృప్తులను, అసమ్మత్తుల వర్గాని ఒకే వేదికపై తీసుకురావడంలో విజయం సాధించారు. హిందూపురం వైసీపీ వ్యవహారాలను మంత్రి పెద్ది రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు. హిందూపురం వైసీపీ నేతలను ఒకేతాటిపైకి తేవడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. ఇలా వైసీపీ వేగంగా ఉన్న సమయంలో బాలకృష్ణ మాత్రం నియోజవర్గ ప్రజలకు అందుబాటులో లేక డీలాపడుతున్న తమ్ముళ్లు.

వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహామేరకు టీఎన్ దీపినకు హిందూపురం వైసీపీ కో ఆర్డినేటర్ గా నియమించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపురంలో మహిళా అభ్యర్థులకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో బాలయ్యను ఓడించేందుకు మహిళా అస్త్రం ప్రయోగించాలని వైసీపీ  భావించింది. హిందూపురంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఓ మహిళకు టికెట్ ఇవ్వలేదని గెలిపించుకుంటే మంత్రిని చేస్తారంటూ వార్తలు విపినిస్తోన్నాయి. ఇలా మహిళా అభ్యర్ధిని రంగంలోకి దింపి.. బాలకృష్ణను ఓడించాలని అధికార పార్టీ ప్రణాళికను సిద్ధం చేసింది. మరి..హిందూపురంలో వైసీపీ జెండా ఎగురుతుందా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రబాబు దగ్గర భారీగా బ్లాక్‌ మనీ.. నోటీసులు జారీ చేసి ఐటీ శాఖ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి