iDreamPost

చంద్రబాబు దగ్గర భారీగా బ్లాక్‌ మనీ.. నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ

చంద్రబాబు దగ్గర భారీగా బ్లాక్‌ మనీ.. నోటీసులు  జారీ చేసిన ఐటీ శాఖ

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు గెలుపు లక్ష్యంగా పలు వ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఊహించని ఝలక్ తగలడం ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వద్ద ఉన్న రూ.118 కోట్లను నల్లధనం అని ఐటీ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయన విజ్ఞప్తి తోసిపుచ్చి షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఐటీ శాఖ.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో పలు అక్రమాలకు పాల్పపడ్డారని ఆరోపణలు వచ్చాయి. అమరావతి కాంట్రాక్టర్లు అయిన షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి చంద్రాబు నాయుడికి రూ.118 కోట్ల వరకు ముడుపులు అందినట్లు  ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ కి ముడుపుల రూపంలో డబ్బును డెలివరీ చేసినట్లు షాపూర్జీ పల్లోంజీ మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వాంగ్మూలం ఆధారంగానే ఐటీ శాఖ తాజా నోటీసుల్లో ఇన్ ఫ్రా సంస్థల ద్వారా తీసుకున్నటువంటి డబ్బు రూ.118 కోట్లను నల్ల ధనంగా ఎందుకు పరిగణించరాదో చెప్పాలని చంద్రబాబు ని కోరింది.

ఈ విషయంపై రీ అస్సెస్ చేయవలసిందిగా చంద్రబాబు కోరగా.. దీనిపై స్పందించిన ఐటీ శాఖ చంద్రబాబు అభ్యంతరాలను తోసిపుచ్చింది. అంతేకాదు ఆయనకు షాక్ ఇస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. చంద్రబాబు నాయుడు 2016 నుంచి 2019 వరకు పలు బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ఎంతో డబ్బు ముడుపులుగా అందుకున్నట్లు ప్రాథమిక అధారాలు సేకరించినట్లు ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే షాపూర్జీ పల్లంజి మనోజ్ వాసుదేవ్, పార్థసాని నివాసాల్లో ముమ్మర తనిఖీ చేపట్టగా ఈ భాగోతం బయటపడినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. చంద్రబాబు అభ్యర్థన తిరస్కరించిన తర్వాత ఆగస్టు 4వ తేదీనే ఐటీ సెంట్రల్ సర్కిల్ ఆఫీస్ నుంచి సెక్షన్ 153సి కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

ఇక బోగస్ కంపెనీల ద్వారా వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని చట్టప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది ఆదాయపన్నుశాఖ. ఇదిలా ఉంటే.. ఫోనిక్స్ ఇన్ఫ్రా, పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్ట్ కంపెనీల ద్వారా నగదు మల్లింపు జరిగిందని అధికారులు తెలిపారు. చంద్రబాబు పాలనలో ఆయన పీఏ శ్రీనివాస్ తో పార్థసారథి ఎప్పుడు టచ్ లో ఉండేవారని.. పీఏ ద్వారానే సబ్ కాంట్రాక్టుల కంపెనీల నుంచి ముడుపుల రూపంలో కోట్ల డబ్బు తన యజమాని అయిన చంద్రబాబు కి అందించినట్లు ఐటీ శాఖ తెలిపింది. కాగా, ఆదాయపన్నుశాఖ వారు చంద్రబాబు కు నోటీసులు అందించిన విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక బయటపెట్టింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి