iDreamPost

స్కూటీ ఖరీదుకే కారు.. మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ఛాయస్!

కారు కొనాలంటే సామాన్యులు కాస్తా ఆలోచించాల్సిన పరిస్థితే. ఎందుకంటే లక్షలు పెట్టి కొనుగోలు చేసే స్థోమత వారి దగ్గర ఉండదు. అలాంటి వారికి గుడ్ న్యూస్. స్కూటీ ధరకే కారు వచ్చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

కారు కొనాలంటే సామాన్యులు కాస్తా ఆలోచించాల్సిన పరిస్థితే. ఎందుకంటే లక్షలు పెట్టి కొనుగోలు చేసే స్థోమత వారి దగ్గర ఉండదు. అలాంటి వారికి గుడ్ న్యూస్. స్కూటీ ధరకే కారు వచ్చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

స్కూటీ ఖరీదుకే కారు.. మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ఛాయస్!

ఈ హెవీ ట్రాఫిక్ లో టూవీలర్ నడపడం అనేది కత్తి మీద సాము లాంటిది. అస్తమానూ కాళ్ళు కింద పెట్టాల్సి ఉంటుంది. చాలా చిరాకు అనిపిస్తుంది కదా. ఇక వర్షాలు పడితే అమ్మో నరకమే. బండి పక్కన పడేసి ఎంచక్కా కారులో ఆఫీస్ కి వెళ్లి వస్తుంటే ఎంత బాగుంటుంది. అయినా మన లాంటి సామాన్యులకి కారు కొనే కెపాసిటీ కూడానా. చాల్లే ఈ ఇరుకు జీవితంలో కారొకటి తక్కువైందా మనకి అనిపిస్తుంది. కార్లున్న వాళ్ళే మెట్రో దగ్గర పక్కన పడేసి మెట్రోకి పోతున్నారు ట్రాఫిక్ గోల పడలేక. అలాంటిది నీకు కారు కావాల్సి వచ్చిందా అని అంటారు కూడా. ఇన్ని దరిద్రాలు ఉండడం వల్ల కారు కొనాలన్నా ఆలోచన కూడా చచ్చిపోతుంది సగటు మనిషికి.

అయితే బైక్ ధరకే కారు వస్తే.. బైక్ సైజ్ లో కారు ఉంటే.. ఏటి ఈ మాట వింటేనే బాగుంది కదూ. మరి ఇది నిజం అయితే. అవును ఒక దర్జాగా కారులో వెళ్ళాలి అనుకునే సామాన్యుడి కోసమే ఈ కారుని తయారు చేశారు. ఇదేమీ ఇంటర్నేషనల్ బ్రాండ్ కాదు. మన ఇండియన్ కంపెనీ వాళ్ళు చేసిందే. యకుజ అనే కంపెనీ వాళ్ళు మన లాంటి వాళ్ళ కోసం ఒక మినీ ఎలక్ట్రిక్ కారుని తయారు చేశారు. బైక్ అంత సైజ్ లో ఉంటుంది. బైక్ కి రక్షణ కవచాన్ని తగిలిస్తే ఇలా ఉంటుందో ఇది అలా ఉంటుంది. రెండే రెండు సీట్లు ఉంటాయి. ముందు ఒకటి, వెనుక ఒకటి. ముందు సీట్లో డ్రైవింగ్ చేసేవారు కూర్చోడానికి.. వెనుక ఇద్దరు కూర్చోడానికి కంఫర్ట్ గా ఉంటుంది.

న్యూ జనరేషన్ అల్లోయ్ వీల్స్ తో, స్టైలిష్ గ్రిల్, బోల్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ఎస్ వంటి డిజైన్ కాంపోనెంట్స్ తో వస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ స్టాప్ సిస్టమ్.. స్మార్ట్ గేర్ నాబ్ ఫీచర్స్ తో వస్తుంది. కంఫర్ట్ పరంగా కూడా ఇది చాలా బాగుంటుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా, రెండు ఎయిర్ బ్లోవర్స్, 3 సీటర్ కెపాసిటీతో వస్తుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. వెంటిలేటెడ్ రూఫ్ ఒకటి దీనికి అమర్చారు. దీని వల్ల మీరు వెంటిలేషన్ ని పొందుతారు. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 60 వోల్ట్స్, 45 ఏహెచ్ తో ఉంటుంది. ఛార్జర్ కనెక్షన్ టైప్ వచ్చేసి టైప్ 2 ఛార్జర్ ఇస్తున్నారు. 0 నుంచి 100 శాతం ఛార్జింగ్ ఎక్కడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర ఐతే రూ. 1.70 లక్షలని తెలుస్తోంది.

కొంచెం దీని కంటే పెద్ద సైజులో ఎంజీ కామెట్ ఈవీ వస్తుంది. దానితో పోలిస్తే ఈ మినీ ఎలక్ట్రిక్ కారు చాలా బెటర్. ఎందుకంటే సైజులో గానీ, ధరలో గానీ కామెట్ ఈవీతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ. ఎంజీ కామెట్ ఈవీ కొనాలంటే బేసిక్ మోడల్ వచ్చేసి 6 లక్షల పైనే ఉంది. మొదట్లో 8 లక్షలు పెట్టారు. రీసెంట్ గా లక్ష రూపాయలు తగ్గించారు. ఎలా చూసినా గానీ కామెట్ ఈవీ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ కారు అయితే కాదు. కానీ యకుజ కరిష్మా ఎలక్ట్రిక్ కారు మాత్రం మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు. అలానే బజాజ్ క్యూట్ తో పోల్చినా కూడా ఇది చాలా అంటే చాలా బెటర్. నిజానికి ఒక ఎలక్ట్రిక్ బైక్ కొనాలంటేనే లక్షా 20 వేల నుంచి లక్షా 50 వేలు అవుతుంది.

ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈవీ కొనాలంటే రెండు లక్షలు అవుతుంది. అలాంటిది బైక్ ధరలోనే.. బైక్ కంటే తక్కువ ధరకే ఒక మినీ కారు వస్తుందంటే నిజంగా సామాన్యుల పాలిట వరం అనే చెప్పాలి. అది కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ వస్తుండడం శుభ పరిణామం అనే చెప్పాలి. పెట్రోల్ ఖర్చు ఉండదు. వర్షంలో తడిసి వెళ్ళాలి.. బురదలో కాలు పెట్టాలి అన్న చిరాకు, టెన్షన్ వంటివి ఉండవు. పార్కింగ్ సమస్య అంతకంటే ఉండదు. పెద్ద కారు మాదిరి పెద్ద పార్కింగ్ స్పేస్ అవసరం లేదు. డ్రైవింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ కారు తోలితే ఫ్యూచర్ లో పెద్ద కారు నడపగలుగుతారు. ఇది మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ట్రాఫిక్ లో చిరాకుపడే వారికి ఈ మినీ ఎలక్ట్రిక్ కారు అనేది బెస్ట్ ఆప్షన్. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ కారు సరిపోతుంది.

డ్రా బ్యాక్స్:

ఇంత తక్కువ ధరకి ఇంత మంచి కారు వస్తుంటే డ్రా బ్యాక్స్ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కానీ ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేసేవారి గురించి ఆలోచించి డ్రా బ్యాక్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం సూటయ్యే కారు అని చెప్పాం కదా అని లాంగ్ డ్రైవ్ కి వెళ్లడానికి వీలవ్వదు. పండగలకి సొంతూరు వెళ్లాలంటే కుదరదు. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లాలంటే కుదరదు. కేవలం ఆఫీస్ పర్పస్ మాత్రమే.. సిటీలో చిన్న చిన్న పనులకి ఉపయోగపడుతుంది. ఒక రకంగా కారు లేని లోటు తీరుస్తుంది. ఈ యకుజ గాడు లోకల్ గాడు. లోకల్ లోనే వీడి టాలెంట్ ఏంటో తెలుస్తుంది. అది మరి విషయం.

దీన్ని పొందాలంటే ఎలా?

ఈ మినీ ఎలక్ట్రిక్ కారుని పొందాలంటే మీరు యకుజ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత కంపెనీ వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. కారు కొన్న 3 నుంచి 6 రోజుల్లోగా మీకు డెలివరీ చేస్తారు. అయితే ఈ డెలివరీ పీరియడ్ అనేది కొన్నిసార్లు మారుతుంటుంది. కొత్త వాహనాలు లాంచ్ అయితే కనుక ఆర్డర్ చేసిన 30 రోజుల తరువాత డెలివరీ అవుతుంది. పేమెంట్ ప్రాసెస్, వెరిఫికేషన్ పూర్తయ్యాక మాత్రమే ఈ కారు డెలివరీ చేయబడుతుంది.

కంపెనీ హెడ్ క్వార్టర్ హర్యానాలో ఉంది. రీజనల్ ఆఫీసులు పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి కంపెనీ వారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే info@yakuzaev.com కి మెయిల్ చేసి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మేనేజర్ హెల్ప్ డెస్క్ నంబర్ 9671302982 కి కాల్ చేయండి.

కంపెనీ చిరునామా:
Headquarter:
28 A/B, Industrial Area, HSIIDC, Near Delhi Pull, Hisar Road, Sirsa, Haryana (125055)
Regional Office

Memari, Purba Bardhaman, West Bengal (713146)

Mishra ITI College, Nh 44 Gram Samudan, Dabra , Gwalior, Madhya Pradesh

పూర్తి సమాచారం కోసం పైన ఉన్న అడ్రస్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా www.yakuzaev.com/karishma/ వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.

గమనిక: కొనే ముందు ఒకసారి అన్నీ పరిశీలించుకోవాల్సిందిగా మనవి. పేమెంట్ చేసే ముందు బాగా ఆలోచించి, నిర్ధారించుకున్న తర్వాతే చేయండి. ఎవరో చెప్పారని కాకుండా స్వయంగా కంపెనీ వారితో మాట్లాడి జెన్యూన్ అని అనిపిస్తే హ్యాపీగా ప్రొసీడ్ అవ్వండి. వీలయితే కంపెనీ ఉన్న లొకేషన్ కి వెళ్లి టెస్ట్ రైడ్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి