iDreamPost

ఎట్టకేలకు పాకిస్థాన్ ఓటములకు బ్రేక్.. సెమీస్ ఛాన్స్ ఉందా?

  • Author singhj Published - 09:43 PM, Tue - 31 October 23

వరుస ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఇవాళ బంగ్లాదేశ్​తో ఆడిన మ్యాచ్​లో బాబర్ సేన నెగ్గింది. విక్టరీ నేపథ్యంలో పాక్ సెమీస్ ఛాన్సులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

వరుస ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఇవాళ బంగ్లాదేశ్​తో ఆడిన మ్యాచ్​లో బాబర్ సేన నెగ్గింది. విక్టరీ నేపథ్యంలో పాక్ సెమీస్ ఛాన్సులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 09:43 PM, Tue - 31 October 23
ఎట్టకేలకు పాకిస్థాన్ ఓటములకు బ్రేక్.. సెమీస్ ఛాన్స్ ఉందా?

వన్డే వరల్డ్ కప్​-2023లో పాకిస్థాన్​ టీమ్​కు ఏదీ కలసిరావడం లేదు. వరుస ఓటములు, కెప్టెన్ బాబర్ ఆజం వాట్సాప్ చాట్ లీక్ అవ్వడం, చీఫ్​ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పోస్ట్​కు రాజీనామా చేయడంతో ఆ దేశ క్రికెట్​లో అలజడి రేగింది. పాక్ క్రికెట్ ఎటు వైపు పోతుందో అర్థం కాని పరిస్థితి. వరల్డ్ కప్​లో ఆ జట్టు సెమీఫైనల్​కు చేరే ఛాన్సులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో పాక్ పనైపోయిందని అంతా అనుకున్నారు. ఈ టైమ్​లో దాయాది జట్టుకు కాస్త ఊరట లభించింది. ఎట్టకేలకు వరుసగా నాలుగు ఓటముల తర్వాత పాకిస్థాన్ విజయం సాధించింది. కోల్​కతా వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో బాబర్ సేన 7 వికెట్ల తేడాతో నెగ్గింది.

బంగ్లాదేశ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్​ను పాకిస్థాన్ కేవలం 32.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. ఆ టీమ్​ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (68), ఫకర్ జమాన్ (81) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో లక్ష్యం చిన్నబోయింది. డేంజరస్​గా మారిన ఈ జోడీని హసన్ మిరాజ్ విడగొట్టాడు. ఫస్ట్ వికెట్​కు షఫీక్-జమాన్ కలసి 128 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. షఫీక్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజం (9) మరోమారు ఫెయిల్ అయ్యాడు. అయితే మహ్మద్ రిజ్వాన్ (26 నాటౌట్), ఇఫ్తికార్ అహ్మద్ (17 నాటౌట్) టార్గెట్​ను పూర్తి చేశారు. పాక్ మూడు వికెట్లు మిరాజ్​కే దక్కాయి.

అంతకుముందు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్​లో లిట్టన్ దాస్ (45), మహ్మదుల్లా (56), షకీబల్ హసన్ (43), మెహదీ హసన్ మిరాజ్ (25) రాణించారు. వీళ్లందరికీ మంచి స్టార్ట్ దొరికింది. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో ఫెయిలయ్యారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం చెరో 3 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్​లో విజయంతో పాయింట్స్ టేబుల్​లో ఐదో ప్లేస్​కు ఎగబాకింది పాకిస్థాన్. సెమీస్​కు చేరుకోవాలంటే కీలకమైన రన్​రేట్​ను కూడా బాబర్ సేన మెరుగుపర్చుకుంది. ఈ ఓటమితో బంగ్లా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.

బంగ్లాదేశ్​పై గెలుపుతో జోష్​లో ఉన్న పాకిస్థాన్.. నెక్స్ట్ ఆడబోయే మ్యాచుల్లో న్యూజిలాండ్​ను, ఇంగ్లండ్​ను తప్పక ఓడించాలి. ఈ రెండు మ్యాచుల్లోనూ భారీ రన్​రేట్​తో గెలవాలి. ఏ ఒక్క మ్యాచ్​లో ఓడినా బాబర్ సేన ఇంటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ పాక్ అన్ని మ్యాచుల్లోనూ భారీ తేడాతో గెలిచినా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ ఆడబోయే మ్యాచ్​ల రిజల్ట్​ను బట్టే సెమీస్ బెర్త్ డిపెండ్ అవుతుంది. మరి.. సెమీస్​లో భారత్​తో పాక్ తలపడితే చూడాలని మీరు అనుకుంటే.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: లంకతో మ్యాచ్​కు ముందు కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తన డ్రీమ్ అదేనంటూ..! 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి