iDreamPost

షకీబ్​పై ప్రతీకారం తీర్చుకున్న మాథ్యూస్.. కాలం ఎవర్నీ వదలదు!

  • Author singhj Published - 02:11 PM, Tue - 7 November 23

బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్​లో ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. ఇన్నేళ్ల ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలో ఒక బ్యాటర్ ఇలా పెవిలియన్​కు చేరడం ఇదే ఫస్ట్ టైమ్.

బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్​లో ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. ఇన్నేళ్ల ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలో ఒక బ్యాటర్ ఇలా పెవిలియన్​కు చేరడం ఇదే ఫస్ట్ టైమ్.

  • Author singhj Published - 02:11 PM, Tue - 7 November 23
షకీబ్​పై ప్రతీకారం తీర్చుకున్న మాథ్యూస్.. కాలం ఎవర్నీ వదలదు!

వన్డే వరల్డ్ కప్-2023లో పొరుగు దేశం శ్రీలంక కథ ముగిసింది. ఇప్పటిదాకా టెక్నికల్​గానైనా సెమీఫైనల్ రేసులో ఉన్న ఆ టీమ్.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో బంగ్లా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన లంకకు మంచి స్టార్ట్ దొరకలేదు. మొదటి ఓవర్లోనే కుశాల్ పెరీరా (4) ఔటయ్యాడు. అయితే నిశాంక (41), కుశాల్ మెండిస్ (19) చక్కటి పార్ట్​నర్​షిప్ నెలకొల్పారు. వీళ్లిద్దరూ వెంటవెంటనే ఔటైనా అసలంక (108), సమరవిక్రమ (41) టీమ్​ను ఆదుకున్నారు. ఆ తర్వాత సమరవిక్రమ ఔటవ్వడం, వెంటనే మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అవ్వడంతో లంక ఇన్నింగ్స్ కుదుపునకు గురైంది. ధనంజయ (34), తీక్షణ (21) అండతో ఆఖరి వరకు పోరాడాడు అసలంక.

లంక ఇన్నింగ్స్​లో అసలంక ఆటే హైలైట్ అని చెప్పొచ్చు. ఛేజింగ్​కు దిగిన బంగ్లాకు కూడా గొప్ప స్టార్ట్ దొరకలేదు. 41 రన్స్​కే తంజిద్ (9), లిటన్ దాస్ (23) పెవిలియన్​కు చేరుకున్నారు. షంటో మాత్రం వీలైనప్పుడల్లా బౌండరీలు కొడుతూ పోయాడు. అయితే బాగా ఆడుతున్న షకీబల్ హసన్ (82), సెంచరీ దిశగా దూసుకెళ్తున్న షంటో (90)​ను మాథ్యూస్ వరుస ఓవర్లలో వెనక్కి పంపాడు. కానీ మహ్మదుల్లా (22), హృదోయ్ (15 నాటౌట్) బంగ్లాను విజయతీరాలకు చేర్చారు. ఇక, బంగ్లా-లంక మ్యాచ్​లో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ విషయం వివాదాస్పదంగా మారింది. బ్యాటింగ్​కు రావాల్సిన మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు)లోగా క్రీజులోకి వచ్చి బాల్​ను ఫేస్ చేయకపోవడంతో అతడ్ని టైమ్డ్ ఔట్​గా ప్రకటించారు.

అప్పీల్​ను వెనక్కి తీసుకోవాల్సిందిగా బంగ్లా కెప్టెన్​ షకీబ్​ను మాథ్యూస్​ కోరినప్పటికీ అతడు వినలేదు. తన హెల్మెట్ పట్టీ తెగిపోయిందని చూపించినప్పటికీ షకీబ్ నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో అతడు పెవిలియన్​కు చేరక తప్పలేదు. అయితే అదే మ్యాచ్​లో బంగ్లా ఇన్నింగ్స్​లో షకీబ్​ను ఔట్ చేశాడు మాథ్యూస్. ఔటై వెళ్తున్న సమయంలో షకీబ్​కు తన చేతిని చూపిస్తూ టైమ్ ఔట్​కు రీవేంజ్ ఇది అనేలా సైగ చేశాడు మాథ్యూస్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్స్.. కాలం ఎవర్నీ వదలదని, కర్మఫలం అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. షకీబ్-మాథ్యూస్ కాంట్రవర్సీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: రోహిత్ కు తలనొప్పిగా మారిన కోహ్లీ ఫ్యాన్స్.. అస్సలు వదలట్లేదు!

 

View this post on Instagram

 

A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి