iDreamPost

IPL చరిత్రలో RCB చెత్త రికార్డ్! పాపం.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు!

ఇప్పటికే ప్లే ఆఫ్స్ లో ఓడి పుట్టెడు బాధలో ఉన్న ఆర్సీబీ తన పేరిట ఓ చెత్త రికార్డ్ ను నమోదు చేసి మరో అపకీర్తిని మూటగట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇప్పటికే ప్లే ఆఫ్స్ లో ఓడి పుట్టెడు బాధలో ఉన్న ఆర్సీబీ తన పేరిట ఓ చెత్త రికార్డ్ ను నమోదు చేసి మరో అపకీర్తిని మూటగట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

IPL చరిత్రలో RCB చెత్త రికార్డ్! పాపం.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు!

IPL ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు మహ్మద్ గజినీలా దండయాత్రలు చేస్తూనే ఉంది. ఎలాగైతే మహ్మద్ గజినీ ఇండియాను గెలుచుకోవడానికి 17 సార్లు దండయాత్రలు చేశాడో.. ఇప్పుడు ఆర్సీబీ సైతం ఐపీఎల్ ట్రోఫీ కోసం 17 సీజన్లుగా యుద్ధం చేస్తూనే ఉంది. అయితే ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో ఈ సీజన్ లోకి అడుగు పెట్టింది. కానీ ఈసారి కూడా వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ లో ఓడి పుట్టెడు బాధలో ఉన్న ఆర్సీబీ తన పేరిట ఓ చెత్త రికార్డ్ ను నమోదు చేసి మరో అపకీర్తిని మూటగట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలనే ఆర్సీబీ కల ఈసారి కూడా ఆవిరైంది. రాజస్తాన్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది రాజస్తాన్ టీమ్. దాంతో ఆర్సీబీ కప్ కొడుతుందని వేయి కళ్లతో ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయి బాధలో ఉన్న బెంగళురు టీమ్ ఖాతాలో మరో అపకీర్తి వచ్చి చేరింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్ ను తనపేరిట లిఖించుకుంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ లో ఓడిపోయిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు టీమ్ వరస్ట్ రికార్డ్ ను నెలకొల్పింది. ప్లే ఆఫ్స్ లో 16 మ్యాచ్ ల్లో 10 సార్లు ఓడిపోయిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఈ లిస్ట్ లో వరుస గా చెన్నై సూపర్ కింగ్స్(26 మ్యాచ్ ల్లో 9 ఓటములు), ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ ల్లో 9, ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్ ల్లో 7 ఓటములు, సన్ రైజర్స్ 12 మ్యాచ్ ల్లో 7 పరాజయాలతో తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ చెత్త రికార్డ్ చూశాక.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి