iDreamPost

SRH సెన్సేషన్ నితీశ్ రెడ్డితో ఉన్న ఈ అమ్మాయి ఎవరంటే?

Guess This Girl With SRH Nitish Kumar Reddy: సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఎక్కువగా నితీశ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే నెట్టింట నితీశ్ కుమార్ ఒక అమ్మాయితో కలిసి ఉన్న పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?

Guess This Girl With SRH Nitish Kumar Reddy: సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఎక్కువగా నితీశ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే నెట్టింట నితీశ్ కుమార్ ఒక అమ్మాయితో కలిసి ఉన్న పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?

SRH సెన్సేషన్ నితీశ్ రెడ్డితో ఉన్న ఈ అమ్మాయి ఎవరంటే?

ప్రస్తుతం అందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 గురించే మాట్లాడుకుంటున్నారు. దాదాపుగా ఐపీఎల్ ముంగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ఫస్ట్ క్వాలిఫయర్ ముగిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్స్ చేరింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి క్వాలిఫయర్లో ఓడిపోయి.. రెండో క్వాలిఫయర్ లో తలపడేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈసారి సీజన్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా తెలుగోళ్ల టీమ్ లో ఉన్న నితీశ్ రెడ్డి అనే తెలుగు కుర్రాడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా మనోడి పిక్ ఒకటి అమ్మాయితో ఉన్నది నెట్టింట వైరల్ అవుతోంది.

ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో నితీశ్ రెడ్డి పేరు బాగా వినిపిస్తోంది. బ్యాటుతో, బాల్ తో ఈ కుర్రాడు పెద్ద మ్యాజిక్కే చేశాడు. మరో తెలుగు కుర్రాడు టీమిండియా తరఫున రాణించేందుకు రెడీ అయిపోతున్నాడని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా నితీశ్ రెడ్డి ఒక అమ్మాయితో ఉన్న పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి ఎవరు అయ్యి ఉంటుందని కొంతమంది బుర్రకు పదును పెడుతున్నారు. అయితే ఆమె నితీశ్ రెడ్డి ప్రియురాలు, ప్రేయసి అయితే కాదు. కేవలం అభిమాని అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆమె తెలుగు హీరోయిన్ కాబట్టి. కాకపోతే చాలామందికి తెలియక నితీశ్ రెడ్డి ప్రేయసి అనుకుంటున్నారు.

నితీశ్ రెడ్డి పక్కన ఉన్న ఆ అమ్మడు మరెవరో కాదు.. కుషిత కల్లపు. ఇలా కంటే కూడా బజ్జీల పాప అంటే బాగా గుర్తు పడతారు. అయితే నటిగా కుషిత కల్లపు మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే బాబు నెంబర్ వన్ బుల్ షిట్ గాయ్, చాంగురే బంగారు రాజా, నీతోనే నేను అనే మూవీస్ లో నటించి మెప్పించి. టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం నితీశ్ రెడ్డితో కలిసి ఉన్న పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చాలామంది కుషితాని గుర్తుపడుతున్నా కూడా.. కొంతమంది మాత్రం ఆమెను నితీశ్ రెడ్డి ప్రియురాలు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో కుషిత కల్లపు నిలదొక్కుకోవడానికి గట్టిగానే కృషి చేస్తోంది. అటు నితీశ్ రెడ్డి కూడా టీమిండియాలోకి వచ్చి తన సత్తా చాటాలి అని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇలా ఇద్దరు యంగ్ స్టర్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో నెటిజన్స్ కూడా షేర్లు కొట్టేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి